
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ లీడ్ రోల్‌లో నటించిన ‘మర్దానీ’ ఫ్రాంచైజీ హిందీలో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ పదేళ్లలో వచ్చిన రెండు సీజన్లకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియాలోనే ఏకైక లేడీ కాప్ ఫ్రాంచైజీగా మర్దానీ రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం మర్దానీ మూడో సీజన్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ‘మర్దానీ 3’ చిత్రాన్ని 2026 ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో రాణి ముఖర్జీ గన్ పట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. ఇందులోనూ ఆమె న్యాయం కోసం నిస్వార్థంగా పోరాడే డేర్‌డెవిల్ కాప్ శివానీ శివాజీ రాయ్ పాత్రను తిరిగి పోషిస్తున్నారు. మొదటి పార్ట్‌ను ప్రదీప్ సర్కార్ రూపొందించగా, రెండో పార్ట్‌ను గోపీ పుత్రన్ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు మూడో పార్ట్‌కు అభిరాజ్ మినవాల దర్శకత్వం వహిస్తున్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.