రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ‘మర్దానీ’ ఫ్రాంచైజీలో ఇప్పుడు మూడో చిత్రం వస్తోంది. 2014లో తొలిచిత్రం విడుదల కాగా, 2019లో దీనికి సీక్వెల్ వచ్చింది. ఈ రెండూ సూపర్ హిట్ సాధించాయి. ‘మర్దానీ 2’ యానివర్సరీ సంద్భంగా ‘మర్దానీ 3’ని అనౌన్స్ చేస్తూ, మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాణీ ముఖర్జీ మాట్లాడుతూ ‘వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం.
ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్‌గా నటించడం ఎంతో గర్వంగా ఉంది. గత చిత్రాలను మించిన స్క్రిప్ట్‌తోపాటు గూజ్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్స్ ఇందులో ఉన్నాయి. మనల్ని కాపాడుతూ ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడని పోలీస్ ఆఫీసర్స్‌కి ఈ సినిమా అంకితం’ అని చెప్పారు.
‘రైల్వే మెన్’ సిరీస్‌తో మెప్పించిన ఆయుష్ గుప్తా దీనికి స్క్రిప్ట్‌ను అందిస్తున్నాడు. అభిరాజ్ మినవాలా దర్శకత్వం వహిస్తున్నాడు. బ్యాండ్ బాజా భారత్, గూండే, సుల్తాన్, టైగర్3 చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన అభిరాజ్.. ప్రస్తుతం హృతిక్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ‘వార్ 2’కి కూడా వర్క్ చేస్తున్నాడు.