చందాదారుల వివరాలు ఎందుకు ఇవ్వట్లే

చందాదారుల వివరాలు ఎందుకు ఇవ్వట్లే
  • మార్గదర్శికి హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: మార్గదర్శి కేసుపై సోమవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావుతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. మార్గదర్శి చందాదారుల వివరాలు ఇవ్వడానికి మీకున్న ఇబ్బందేంటని ఆ సంస్థను ప్రశ్నించింది.

దీనిపై వివరణ ఇవ్వాలని మార్గదర్శి తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూద్రాను అడిగింది. సుప్రీంకోర్టు చందాదారుల వివరాలు ఇవ్వాలని చెప్పలేదని లూద్రా వాదించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అడిగిన ఫార్మాట్ లో వివరాలు ఇచ్చామని, పెన్ డ్రైవ్ తరహాలో ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో ఉండవల్లి కోరుతున్నారని చెప్పారు.

ఆయన అడిగిన ఫార్మాట్ లో చందాదారుల వివరాలు ఇవ్వడానికి ఉన్న ఇబ్బందేంటో చెప్పాలని కోర్టు మార్గదర్శిని ఆదేశించింది. పిటిషనర్‌‌‌‌‌‌‌‌–2 రామోజీరావు మరణించారని సిద్దార్థ లూద్రా వెల్లడించారు. దీంతో పూర్తి వివరాల కోసం విచారణను కోర్టు నవంబర్‌‌‌‌‌‌‌‌ 4కి వాయిదా వేసింది.