సిమెంట్ కంపెనీల మార్జిన్లు డౌన్​

సిమెంట్ కంపెనీల మార్జిన్లు డౌన్​

న్యూఢిల్లీ : సిమెంట్ కంపెనీల మార్జిన్లు సెప్టెంబర్ క్వార్టర్​లో మార్జిన్లు తగ్గాయి. తక్కువ అమ్మకాలు, తక్కువ ధరలే ఇందుకు కారణమని ఇవి అంటున్నాయి.   అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్  దాల్మియా భారత్ మినహా నువోకో విస్టాస్ కార్ప్, జెకె సిమెంట్, బిర్లా కార్పొరేషన్,  హైడెల్‌‌‌‌‌‌‌‌బర్గ్ సిమెంట్‌‌‌‌‌‌‌‌తో సహా ఇతర చిన్న కంపెనీల టాప్​లైన్​ అమ్మకాలు రెండవ క్వార్టర్​లో తగ్గాయి.  

అల్ట్రాటెక్,  అంబుజా సిమెంట్స్ అమ్మకాల పరిమాణం పెరగడానికి   కారణం  రెండు కంపెనీలు అనేక కొనుగోళ్లు జరిపాయి. వర్షాలు ఎక్కువకాలం పడటం,  ప్రభుత్వ డిమాండ్‌‌‌‌‌‌‌‌లో నెమ్మదిగా పుంజుకోవడం వంటి సవాళ్లను కూడా పరిశ్రమ ఎదుర్కొంది.  అయితే పవర్, ఇంధనం,  ఇతర ఖర్చులు  చాలా వరకు స్థిరంగా ఉన్నాయి.  జూన్ 2024లో సగటు సిమెంట్ ధర 50 కిలోల బస్తాకు రూ. 348గా ఉంది.

ఇది సెప్టెంబరులో ఏడాది ప్రాతిపదికన 11 శాతం తగ్గి రూ. 330కి చేరింది. అయితే ఇది నెలవారీగా 2 శాతం పెరిగింది.   2025 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో, సిమెంట్ ధరలు ఏడాది ప్రాతిపదికన 10 శాతం క్షీణించి బస్తా ధర రూ.330కి పడిపోయింది. ఒక సంవత్సరం క్రితం ధర  రూ. 365   ఉండేది.