సిగరెట్ తాగుతూ ఊపిరాడక అసిస్టెంట్ డైరెక్టర్ మృతి

సిగరెట్ తాగుతూ ఊపిరాడక అసిస్టెంట్ డైరెక్టర్ మృతి

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. స్టార్ డైరెక్టర్‌ మారి సెల్వరాజ్(Mari Selvaraj) దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువ దర్శకుడు మారిముత్తు(Marimuthu) మృతి చెందారు. పరియేరుం పెరుమళ, కర్ణన్, మమన్నన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు మారిముత్తు. 30 ఏళ్ల వయసులోనే మారిముత్తు కన్నుమూయడంతో ఆయన కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మారిముత్తు మరణవార్త తెలిసి తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 

ఇక మారిముత్తు మరణానికి గల కారణం ఊపిరాడకపోవడమే అని తెలుస్తోంది. మారిముత్తుకు చాలా ఏళ్ళ నుండి సిగరెట్‌ కాల్చే అలవాటు ఉండేది. అదే అలవాటులో ఆరోజు కూడా భోజనం చేసిన తర్వాత సిగరెట్‌ తాగుతుండగా.. దగ్గు రావడం ఆపై ఊపిరాడకపోవడంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో తరలించారు కానీ.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే మారిముత్తు మరణాన్ని పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు. ఆయన మృతికి మరేదైనా కారణం ఉంటుందా అనే కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.