హైదరాబాద్, వెలుగు: ఇన్నోవేషన్లను ప్రోత్సహించే ఎఫ్ఎంసీజీ కంపెనీ మారికోకు చెందిన మారికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎంఐఎఫ్) మంగళవారం 'ఇన్నోవేషన్ ఫర్ ఇండియా అవార్డ్స్' పదో ఎడిషన్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. 2006లో ఏర్పాటైన ఈ ప్లాట్‌ఫారమ్, భారతదేశంలో గణనీయమైన సానుకూల సామాజిక, పర్యావరణ, ఆర్థిక ప్రభావం గల ఇన్నోవేషన్లకు మద్దతు ఇస్తుంది.
స్టార్టప్‌లు, వ్యాపారాలతోపాటు ప్రభుత్వ సంస్థలు, దాతృత్వ సంస్థలు, చారిటబుల్ ట్రస్ట్‌లు, బహుపాక్షిక ఏజెన్సీలు, కమ్యూనిటీ ఫౌండేషన్‌లు, ఎన్జీఓలు, సీఎస్ఆర్/కార్పొరేట్ ఫండ్‌లు వంటి లాభాపేక్ష లేని సంస్థలూ పోటీపడవచ్చు. దరఖాస్తులను జూన్ 17, 2024 నుండి జూలై 17, 2024 వరకు సమర్పించవచ్చు. దరఖాస్తుల పరిశీలన ఆగస్టు 2024 నుండి మార్చి 2025 వరకు కొనసాగుతుంది. నాలెడ్జ్ పార్టనర్ ద్వారా అర్హులను ఎంపిక చేస్తామని మారికో తెలిపింది.