
భద్రాచలం, వెలుగు: ఐటీసీ పేపర్ కంపెనీకి జామాయిల్కర్రలను తీసుకొచ్చే లారీలో 30 కిలోల గంజాయి పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నాగరాజు తెలిపిన ప్రకారం.. పక్కా సమాచారంతో భద్రాచలంలోని కూనవరం రోడ్డులో ఆదివారం హైదరాబాద్ ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ వాహనాల తనిఖీ చేపట్టింది. లారీ డ్రైవర్ శివ ఒడిశా నుంచి జామాయిల్కర్రతో పాటు స్మగ్లర్అర్జున్తో కలిసి గంజాయిని భద్రాచలం తీసుకొస్తున్నట్లు గుర్తించారు.
సారపాకలోని జామాయిల్ యార్డులో కర్రను అన్లోడ్ చేసి గంజాయి ప్యాకెట్లను బయటకు తీశారు. గతంలో చాలా సార్లు తీసుకొచ్చి అమ్మినట్లుగా విచారణలో స్మగ్లర్ అర్జున్ఒప్పుకున్నాడు. గంజాయి విలువ రూ.15లక్షలు, లారీ విలువ రూ.20లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అర్జున్‌తో పాటు మరో స్మగ్లర్ ప్రహ్లాద్‌ను అదుపులోకి తీసుకుని భద్రాచలం ఎక్సైజ్పోలీసులకు అప్పగించినట్టు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ తెలిపారు.