
మరికల్, వెలుగు: మరికల్ ఎస్సీ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల ఎస్సీ కార్పొరేషన్ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేయిస్తున్నట్లు కాంగ్రెస్ జిల్లా నాయకులు సూర్యమోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పనులను పరిశీలించారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో పనులు చేస్తున్నారని బీజేపీ నాయకులు చెప్పడం అవాస్తవమని చెప్పారు. 12వ వార్డులో హనుమాన్వాడ నుంచి పోచమ్మ గుడికి వెళ్లే రోడ్డుపై పైపులు వేయించి సమస్యను పరిష్కరించామని తెలిపారు. మాజీ ఎంపీటీసీ గోపాల్, పార్టీ నాయకులు హరీశ్చారి, పి.రామకృష్ణ, చెన్నయ్య, జంగిడి ఆంజనేయులు, నాగరాజు ఉన్నారు.