మరిపెడలో 127 కిలోల గంజాయి స్వాధీనం

మరిపెడలో 127 కిలోల గంజాయి స్వాధీనం

మరిపెడ, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని శుక్రవార మహబూబాబ్‌‌‌‌ జిల్లా మరిపెడ పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సుధీర్‌‌‌‌ రామ్‌‌‌‌నాథ్‌‌‌‌ కేకన్‌‌‌‌ శుక్రవారం మరిపెడ పీఎస్‌‌‌‌లో జరిగిన మీటింగ్‌‌‌‌లో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కుంట మండలం అసిర్‌‌‌‌గూడెం గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి సొడి నాగేశ్వరరావు కారులో హైదరాబాద్‌‌‌‌ వైపు వస్తున్నాడు. మహబూబాబాద్‌‌‌‌ జిల్లా మరిపెడ మండలం గాలివారిగూడెం సమీపంలోని ఏఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌ వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేయగా గంజాయి రవాణా విషయం బయటపడింది.

 దీంతో అతడిని అదుపులోకి తీసుకొని రూ. 31.75 లక్షల విలువైన 127 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. గంజాయిని పట్టుకున్న సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందజేశారు. మీడియా సమావేశంలో మరిపెడ సీఐ రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌, ఎస్సైలు సతీశ్‌‌‌‌గౌడ్‌‌‌‌, సంతోశ్‌‌‌‌, ట్రైనీ ఎస్సై అశోక్ పాల్గొన్నారు.