Success: మోదీకి మారిషస్​ అత్యున్నత పురస్కారం

Success: మోదీకి మారిషస్​ అత్యున్నత పురస్కారం

ప్రధాని నరేంద్ర మోదీని మరో అంతర్జాతీయ పురస్కారం వరించింది. మారిషస్​ అత్యున్నత పురస్కారమైన ది గ్రాండ్​కమాండర్​ ఆఫ్​ ది ఆర్డర్​ ఆఫ్​ ది స్టార్​ అండ్​ కీ ఆఫ్​ ది ఇండియన్​ ఓషన్​ను ఆ దేశ ప్రధాని నవీ చంద్ర రామ్​గులాం ప్రధాని మోదీకి ప్రదానం చేశారు. 

ఇండియా– మారిషస్​ మధ్య సంబంధాల పటిష్టతకు చేసిన విశేష కృషికిగాను మోదీని ఈ అవార్డుతో సత్కరించారు. ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారత ప్రధానిగా, ఐదో విదేశీ నేతగా మోదీ ఘనత సాధించారు. 

ALSO READ | Success: ఆయుధ దిగుమతులపై సిప్రీ నివేదిక

1992, మార్చి 12న మారిషస్​ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు మోదీతో కలిపి ఐదుగురు విదేశీ ప్రముఖులకు  ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని మొదటిసారిగా 1998లో జాతి వివక్ష పోరాట యోధుడు నెల్సన్ మండేలా అందుకున్నారు.