కోర్టులో వివాహిత ఆత్మహత్యాయత్నం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త కాపురానికి తీసుకువెళ్లడంలేదన్న మనస్థాపంతో వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మౌనిక అనే వివాహిత విడాకుల కేసు విషయంలో బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరైంది. కేసు విచారణ జరుగుతుండగానే.. భర్త తనను కాపురానికి తీసుకెళ్లడం లేదన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన కోర్టు సిబ్బంది ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొద్ది రోజులుగా మౌనిక ఆమె భర్త మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. విడాకుల కావాలని భర్త కోర్టుకెక్కడంతో ఆమె నిరాకరించింది.