ఇండియాలో ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకరకంగా చెప్పాలంటే భారత క్రికెట్ కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చూడడానికే అభిమానులు ఆసక్తి చూపిస్తారు. ఐపీఎల్ వచ్చిందంటే దేశంలో పండగ వాతావరణం కురుస్తుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ మెగా లీగ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటని చెప్పాల్సి వస్తే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జట్టుకు సారథ్యం వహించడమే.
అంబానీ ఉన్నా.. సచిన్ లాంటి ప్లేయర్లు గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడినా రోహిత్ కెప్టెన్ గా ఎంట్రీ ఇచ్చాక ఆ జట్టు బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిపోయింది. 10 ఏళ్ళ నుంచి ముంబైని తిరుగులేని జట్టుగా నిలబెట్టి ఐపీఎల్ లో బెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ముంబై యాజమాన్యం రోహిత్ శర్మ స్థానంలో పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఐపీఎల్ 2024లో ముంబై జట్టును పాండ్యా లీడ్ చేయనున్నాడు.
ఈ విషయంతో ఫ్యాన్స్ షాక్ లోకి వెళ్లిపోయారు. అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు గాని ఫ్యాన్స్ మాత్రం ఉద్దేశ్యపూర్వకంగానే రోహిత్ ను తప్పించారని విమర్శలు చేస్తున్నారు. అసలు రోహిత్ ను కెప్టెన్ నుంచి ఎందుకు తప్పించారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. తాజాగా ప్రెస్ మీట్ లో ముంబై హెడ్ కోచ్ మార్క్ బౌచర్ కు ఈ ప్రశ్న ఎదురైంది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించడం వెనుక ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ కారణం గురించి మార్క్ బౌచర్‌ను ఒక రిపోర్టర్ అడగగా..ఈ ప్రశ్నకు బౌచర్ దగ్గర సమాధానం లేకుండా పోయింది.
Also Read : బెంగళూరు క్యాంప్‌లో చేరిన కోహ్లీ
జర్నలిస్ట్ రోహన్ సేన్ తన కాంట్రాక్ట్‌లో కెప్టెన్సీ నిబంధన గురించి MI కెప్టెన్ హార్దిక్ పాండ్యాను అడిగాడు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ సభ్యుడు ఒకరు ఆ జర్నలిస్టును ప్రశ్న అడగకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి రోహిత్ కెప్టెన్సీ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇక 2024 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ లో మార్చి 24 న గుజరాత్ టైటాన్స్ తో తలపడుతుంది.
A question related to Rohit Sharma skipped by Mark Boucher. pic.twitter.com/4nW7MwACmK
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2024