ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్(నాటో)కు తదుపరి సెక్రటరీ జనరల్ డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే నియమితులయ్యారు. 2024, అక్టోబర్ 1 నుంచి రుట్టే సెక్రటరీ జనరల్‌గా తన విధులను స్వీకరించనున్నారు.
ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతున్న వేళ ఐరోపా భద్రతకు కీలకమైన సమయంలో మార్క్ రుట్టే బాధ్యతలు చేపట్టనున్నారు.