బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్ కొత్త వ్యాపారం పెట్టాడు. ఆవులను పెంచుతున్నాడు. చిన్న ఫాంలో కాదు.. ఏకంగా హవాయి ద్వీపంలో. అంతేకాదు వాటికి బీర్ తాగించి వాలనట్స్ తినిపిస్తున్నాడట. ఎందుకో తెలుసా.. ప్రపంచంలోనే అత్యుత్తమ బీఫ్ ను ఉత్పత్తిని చేస్తాడట.
కొత్త కొత్త అభిరుచులను ఆస్వాదించే జుకర్ బర్గ్.. ఇటీవల కమాండోలను మించిన ఫిట్ నెస్ కోసం జిమ్ లో చెమటోడ్చాడు. అతని తాజా అభిరుచి ఆవులను పెంచడం . కేవలం ఆవులను పెంచడమే కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ గోడ్డు మాసం ఉత్పత్తి చేసేందుకు డ్రై ఫ్రూట్స్ బీర్ తినిపించి తాగించి మరీ ఆవులను పెంచుతున్నాడు. అక్కడో ఇక్కడో కాదు.. ఏకంగా హవాయి దీవుల్లో సహజమైన ప్రదేశాల్లో జుకర్ బర్గ్ కాయై లోని సగం ద్వీపాన్ని తీసుకున్నాడట.
ఈ విషయాన్ని స్వయంగా జుకర్ బర్డ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గొడ్డు మాంసం ప్లేట్ లో ముందు పెట్టుకొని నవ్వుతూ ఓ ఫొటో కూడా షేర్ చేశాడు. కవాయ్ లోని కోయోలౌ రాంచ్ లో పశువులను పెంచడం ప్రారంభించాను. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన గొడ్డు మాంసాన్ని సృష్టించడం నా లక్ష్యం.. ఆవులకు ఖరీదైన మకాడమియా గింజలతో తయారు చేసిన మకాడమయా మీల్, స్థానికంగా తయారు చేసిన ఆర్టిసానల్ అనే బీర్ ను తాగిస్తున్నానని ’’ జుకర్ బర్గ్ తన పోస్ట్ లో రాశాడు. జుకర్ బర్గ్ వ్యాపారం సక్సెస్ కావాలని ఆశిద్దాం.