ఎండీఏ పథకంతో ఎంతో ఆదా.. తగ్గనున్న రసాయన ఎరువుల వాడకం

  • ఎండీఏ పథకంతో ఎంతో ఆదా
  • తగ్గనున్న రసాయన ఎరువుల వాడకం

న్యూఢిల్లీ : గోవర్ధన్ ప్లాంట్ల నుంచి సేంద్రీయ ఎరువుల ఉత్పత్తిని పెంచడానికి అమలు చేస్తున్న  మార్కెట్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అసిస్టెన్స్ (ఎండీఏ) పథకం వల్ల రసాయనిక ఎరువుల దిగుమతి 96 లక్షల టన్నులు తగ్గుతుందని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ (ఐబీఏ) తెలిపింది. ఎరువుల దిగుమతి తగ్గడం వల్ల  11,000 కోట్ల రూపాయల విలువైన ప్రయోజనాలు దక్కుతాయని పేర్కొంది. రూ. 1,451 కోట్ల విలువైన ఎండీఏ పథకానికి  ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భూసార పునరుద్ధరణ, పోషణ, మెరుగుదల కోసం కొత్త విధానాలను అమలు చేయడానికి దీనిని ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఉన్న బయోగ్యాస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతోపాటు మరో 500 ప్లాంట్లకు ఎండీఏ కింద ఇన్సెంటివ్స్​ ఇస్తారు. 

ALSO READ :అమెరికా, యూరప్ దేశాల్లో కుతకుత

ఎండీఏ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల బయోఫెర్టిలైజర్ల ఉత్పత్తి 9.6 ఎంఎంటీపీఏలు పెరుగుతుంది. దీనివల్ల రసాయన ఎరువుల దిగుమతులను పడిపోతాయని ఐబీయే తెలిపింది. ఎండీఏతో దాదాపు 96 లక్షల టన్నుల రసాయన ఎరువుల దిగుమతి తగ్గవచ్చని అంచనా వేసింది. పులియబెట్టే విధానంలో బయోగ్యాస్ ప్లాంట్లు సేంద్రీయ ఎరువులను ఉత్పత్తి చేస్తాయి. ఐకార్​ అధ్యయనం ప్రకారం, బయోఫెర్టిలైజర్లు పంట దిగుబడిని 10 నుంచి 25 శాతం పెంచుతాయి. రసాయన ఎరువులతో పాటు వీటిని ఉపయోగిస్తే రైతులకు చాలా డబ్బు ఆదా అవుతుంది.  టన్ను బయోఫెర్టిలైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.1,500 వరకు ఇన్సెంటివ్స్​ ఇస్తారని ఐబీఏ తెలిపింది. దిగుమతులు తగ్గడం వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు.