భోగి మంటల్లో..10 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ సంపద మటాష్..పెట్టుబడిదారుల రక్త కన్నీరు

సంక్రాంతి పండుగ రోజు స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చూశాయి. భోగి రోజు సోమవారం(జనవరి 13) ఓపెనింగ్ లో తీవ్ర నష్టాలకు గురైన మార్కెట్లు కొంత కోలుకున్నట్లు అనిపించినా బ్యాంకింగ్, మెటల్ సెక్టార్ లో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో తీవ్ర నష్టాలకు లోనయ్యాయి.  దీంతో ఇన్వెస్టర్లు ఎన్నడూలేనంత నష్టాలను చవిచూడాల్సి వచ్చింది..దాదాపు రూ. 10లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. 

సోమవారం భారతీయ ఈక్విటీ సూచీలు వరుసగా నాల్గవ సెషన్‌లో బలహీనమైన నోట్‌తో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1049 పాయింట్లు తగ్గి 76వేల 330 పాయింట్ల వద్ద ముగిసింది.. నిఫ్టీ 345 పాయింట్లు తగ్గి 23వేల 085 పాయింట్ల వద్ద ముగిసింది. 

ALSO READ | స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. కోట్ల సంపద ఆవిరి.. ఈ క్రాష్కి 4 ముఖ్య కారణాలు..

నిఫ్టీ అత్యధికంగా నష్టపోయిన ట్రెంట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, భారత్ ఎలక్ట్రానిక్స్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్ లాభపడగా, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ , HUL లాభపడ్డాయి.

 అన్ని రంగాల సూచీలు రియల్టీ ఇండెక్స్ 6.5 శాతం, ఆయిల్ & గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, పవర్, పీఎస్‌యూ, మెటల్, మీడియా 3-4 శాతం చొప్పున నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 4 శాతం చొప్పున క్షీణించాయి.

కారణం ఇదేనా.. 

స్టాక్ మార్కెట్ పతనానికి ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్ విధానాలు అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఎలాంటి చర్యలకు పాల్పడతారోనన్న ఉత్కంఠ ఇన్వెస్టర్లలో నెలకొనడం వెనుక మరో ప్రధాన అంశం. మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వీపీ (పరిశోధన) ప్రశాంత్ తాప్సే మాట్లాడుతూ..యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ ప్లాన్‌ల చుట్టూ ఉన్న అనిశ్చితి, అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ విధానాలు మార్కెట్ నిరాశావాదానికి ఆజ్యం పోస్తున్నాయనిఅన్నారు.

FII అమ్మకాలు కొనసాగాయి

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాలు దలాల్ స్ట్రీట్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎఫ్‌ఐఐ అమ్మకాలు పెరిగిపోయాయి. నిన్న రూ.7170 కోట్లకు చేరుకున్న FIIలకు..ఈ రోజు కూడా ఎలాంటి ఉపశమనం లభించడం లేదు. ఇది మార్కెట్‌పై ఒత్తిడిని పెంచుతూనే ఉంది. అయితే ఎఫ్ ఐఐఐ విక్రయాలు బ్యాంకింగ్ మేజర్ల ఫలితాలను ప్రభావితం చేయలేదు.