‘ఇండియా–పాకిస్తాన్‌‌‌‌’పై మార్కెట్ ఫోకస్‌‌‌‌.. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా గురువారం ( మే 1) సెలవు

‘ఇండియా–పాకిస్తాన్‌‌‌‌’పై మార్కెట్ ఫోకస్‌‌‌‌.. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా గురువారం ( మే 1) సెలవు

న్యూఢిల్లీ:  ఇండియా, పాకిస్తాన్ మధ్య జియోపొలిటికల్ పరిణామాలు, కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్‌‌‌‌, మాక్రో ఎకనామిక్ డేటా ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌‌‌‌ను నిర్ణయించనున్నాయి. ఫారిన్ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా మారారు. వీరి కదలికలను గమనించాలని ట్రేడర్లకు ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. యూఎస్ టారిఫ్ సంబంధిత వార్తలపై కూడా ఫోకస్ పెట్టాలని తెలిపారు. 

కాగా, ఫారిన్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు గత వారంలో నికరంగా రూ.17,425 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.    'మహారాష్ట్ర దినోత్సవం' కారణంగా ఈక్విటీ మార్కెట్లకు గురువారం (మే 1) సెలవు. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) డేటా,  హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌బీసీ మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ డేటా ఈ వారం వెలువడనున్నాయి. బీపీసీఎల్‌‌‌‌, ఐఓసీ, బజాజ్ ఫైనాన్స్, టీవీఎస్‌‌‌‌ మోటార్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి పలు కంపెనీలు తమ క్వార్టర్లీ రిజల్ట్స్‌‌ ఉన్నాయి.