Market Mahalakshmi OTT Release: ఓటీటీలో ‘కేరింత’ఫేమ్ పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి..స్ట్రీమింగ్‌ ఎప్పుడు..ఎక్కడంటే?

‘కేరింత’ ఫేమ్  పార్వతీశం(Parvateesam),  ప్రణీకాన్వికా జంటగా నటించిన చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’(Market Mahalakshmi). వి.యస్.ముఖేష్ దర్శకత్వంలో అఖిలేష్ కలారు నిర్మించారు.

హర్ష వర్ధన్,ముక్కు అవినాష్, మహబూబ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్‌ 18న థియేటర్‌లో రిలీజయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో(ahavideoIN) జులై 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా సరికొత్త పోస్టర్‌ను షేర్ చేసింది. 

‘మార్కెట్ మహాలక్ష్మి' స్టోరీ విషయానికి వస్తే..

సాఫ్ట్‌‌వేర్ జాబ్ చేసుకునే పార్వతీశంకు ఇండిపెండెంట్ ఉమెన్ అంటే చాలా ఇష్టం.తన తల్లితో గొడవపడ్డ కూరగాయలు అమ్మే మహాలక్ష్మిలో ఆ క్వాలిటీస్‌‌ కనిపించి ఐ లవ్ యు చెబుతాడు. ఆమెతో పాటు అతని తల్లి కూడా చెంప  ఛెళ్లుమనిపిస్తారు. ‘మార్కెట్ మహాలక్ష్మితో మజాక్‌‌లు ఆడితే మంచిగా ఉండదు’ అని ప్రణీకాన్వికా ఇచ్చిన మాస్‌‌ వార్నింగ్‌‌ తర్వాత పార్వతీశం ఏం చేశాడు? పార్వతీశం ప్రేమను మహాలక్ష్మి ఎందుకు తిరస్కరించింది? తన ప్రేమను గెలిపించుకోవడానికి పార్వతీశం ఏం చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.