ఫ్యామిలీ లవ్ జానర్లో మార్కెట్ మహాలక్ష్మి.. ఆడియాన్స్ను ఆకట్టుకుంటుంది

ఫ్యామిలీ లవ్ జానర్లో మార్కెట్ మహాలక్ష్మి.. ఆడియాన్స్ను ఆకట్టుకుంటుంది

కేరింత ఫేమ్ పార్వతీశం, ప్రణికాన్విక జంటగా వి.యస్. ముఖేష్ దర్శకత్వంలో అఖిలేష్ కలారు నిర్మిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. ఈ మూవీ టైటిల్ పోస్టర్‌‌‌‌ను నిర్మాత బెక్కెం వేణుగోపాల్, నటుడు శివాజీ లాంచ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా దర్శకుడు ముఖేష్ మాట్లాడుతూ ‘ఇదొక ఫ్యామిలీ లవ్ డ్రామా.

నా విజన్‌‌ని నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతకు, నటీనటులకు థ్యాంక్స్’ అని చెప్పాడు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్‌‌కు ప్లాన్  చేస్తామన్నారు నిర్మాత. హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్  ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మిష్టర్ జో సంగీతం అందిస్తున్నాడు.