షేర్లు వచ్చిన వెంటనే అమ్మకం.. ప్రీలిస్టింగ్​ట్రేడింగ్ యోచనలో సెబీ ​

షేర్లు వచ్చిన వెంటనే అమ్మకం.. ప్రీలిస్టింగ్​ట్రేడింగ్ యోచనలో సెబీ ​
  • త్వరలో ప్రీలిస్టింగ్​ ట్రేడింగ్​

ముంబై: ఐపీఓలో షేర్లు వచ్చిన వెంటనే ఇన్వెస్టర్ వాటిని అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని మార్కెట్​ రెగ్యులేటర్​ సెబీ భావిస్తోంది. గ్రే మార్కెట్​కార్యకలాపాలను తగ్గించేందుకు ఈ ప్రపోజల్​ను పరిశీలిస్తున్నామని సంస్థ చైర్​పర్సన్​ మాధవీపురి బుచ్ చెప్పారు. 

అలాట్​మెంట్​, లిస్టింగ్​మధ్య మూడు రోజుల గడువు ఉంటే.. లిస్టింగ్​ముందే షేర్లను అమ్ముకోవచ్చని అన్నారు. ఈ విషయమై బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలతో చర్చిస్తున్నామని ఆమె చెప్పారు. ఇటీవల వచ్చిన దాదాపు అన్ని ఐపీఓలు విపరీతంగా సబ్​స్క్రయిబ్​అయ్యాయి. 

లిస్టింగ్​లాభాలు కూడా భారీగా వచ్చాయి.  లిస్టింగ్​కు ముందు గ్రేమార్కెట్​లావాదేవీలు ఎక్కువ అవుతున్నాయి.  అయితే ఐపీఓల ద్వారా వచ్చిన డబ్బును కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని మాధవి విమర్శించారు.