న్యూఢిల్లీ: మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేసే రీసెర్చ్ రిపోర్ట్‌లను స్వయంగా సెబీనే ఇష్యూ చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం పబ్లిక్‌లో అందుబాటులో ఉన్న రీసెర్చ్ రిపోర్ట్‌లను మార్కెట్‌లో పాల్గొన్నవారు విడుదల చేస్తున్నారు. వీరు తమ బిజినెస్‌లను పెంచుకోవడమే లక్ష్యంగా ఈ రిపోర్ట్‌లను క్రియేట్ చేస్తున్నారు. దీంతో స్వయంగా సెబీనే మార్కెట్ పెరుగుతోందా? లేదా తగ్గుతోందా? వంటి మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడూ రీసెర్చ్ చేసి రిపోర్ట్‌లను విడుదల చేయాలని చూస్తోంది. ఈ ప్లాన్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు.
మార్కెట్‌లోని రిస్క్‌లను, ఇన్వెస్టర్లపై వీటి ప్రభావాన్ని తెలియజేసే రిపోర్ట్‌లను విడుదల చేస్తూ మిగిలిన దేశాల సెక్యూరిటీస్ రెగ్యులేటరీలకు సెబీ మార్గదర్శకంగా ఉండాల్సిన టైమ్ వచ్చిందని అన్నారు. ఇన్వెస్టర్లు ఎందులో ఇన్వెస్ట్ చేయాలో సెబీ నిర్ణయించలేదని, కానీ, మార్కెట్ పరిస్థితులను వివరిస్తే ఇన్వెస్టర్లే సరియైన నిర్ణయం తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఇన్వెస్టర్లు తొందరగా ధనవంతులు కావాలనే ఉద్దేశంతో ఫండమెంటల్స్ బాగోలేని షేర్లలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. డబ్బులు నష్టపోతున్నారు. ఇంకా, ఎటువంటి సొంత ఆలోచన లేకుండా మిగిలిన ఇన్వెస్టర్లను ఫాలో అవుతున్నారు. కరోనా టైమ్‌లో పానిక్ సెల్లింగ్ ను చూశాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మార్కెట్‌లోకి వచ్చిన ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్టర్లు చేతులు కాల్చుకున్నారు. ఏం తెలియకుండానే కష్టమైన ఆప్షన్స్, ఫ్యూచర్స్ సెగ్మెంట్‌లలో కూడా ఇన్వెస్ట్ చేసి నష్టపోతున్నారు. అదే సెబీనే రీసెర్చ్ రిపోర్ట్‌లు విడుదల చేస్తే ఇన్వెస్టర్లు కేవలం తమ ఫండ్ మేనేజర్ల మాటలే నమ్మకుండా, ఇండిపెండెంట్‌గా నిర్ణయాలు తీసుకోవాడానికి వీలుంటుంది.