- భువనగిరిలో హయ్యస్ట్ మార్కెట్వ్యాల్యూ
- ఆ తర్వాతి స్థానంలో పోచంపల్లి
- డేటా సేకరించిన సబ్ రిజిస్ట్రార్లు
- 30 నుంచి 40 శాతంతో ప్రపోజల్స్
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో భూముల మార్కెట్‌విలువ భారీగా పెరగనుంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం జిల్లా కేంద్రమైన భువనగిరిలో హయ్యస్ట్.. ఆ తర్వాత భూదాన్‌పోచంపల్లిలో పెరగనుంది. ఈ జిల్లా మీదుగా విజయవాడ, వరంగల్ హైవేలు వెళ్తుండడంతో ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట టెంపుల్ఇక్కడే ఉంది. గత ప్రభుత్వం ఈ టెంపుల్ ను అభివృద్ధి చేయడంతో జిల్లాలో రియల్ఎస్టేట్రంగం ఊపందుకుంది. దీంతో బహిరంగ మార్కెట్లో ఇక్కడి భూముల విలువ భారీగా పెరిగాయి. అమలులో ఉన్న రిజిస్ట్రేషన్మార్కెట్విలువ, బహిరంగ మార్కెట్‌విలువ కంటే చాలా తక్కువగా ఉంది. తాజాగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్విలువను సవరించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఆఫీసర్ల కసరత్తు..
భూముల మార్కెట్విలువను సవరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. తహసీల్దార్ల నుంచి సబ్‌రిజిస్టార్లు సర్వే నంబర్లవారీగా వివరాలు సేకరించారు. పైగా ఏఏ సర్వే నంబర్ల భూమి నేషనల్, స్టేట్హైవేలతో పంచాయతీ రోడ్ల పక్కన ఉన్నాయో వివరాలు రాబడుతున్నారు. రోడ్డు సౌకర్యం సరిగా లేని భూములను డేటా సేకరణలో అర్బన్, కమర్షియల్, రూరల్విభాగాలుగా భూములను విభజించారు. వెంచర్లలోని ప్లాట్లకు సంబంధించిన వివరాలను విడిగా ప్రస్తావించారు. దీంతోపాటు భవిష్యత్‌లో రేటు పెరిగే భూములను గుర్తించారు.
గుర్తించిన ప్రాంతాలు..
భువనగిరి మండలంలోని రాయగిరి సహా సూరెపల్లి వరకు దాదాపు 25 గ్రామాల్లోని వందలాది సర్వే నంబర్లలోని భూములకు అత్యధికంగా ధర పలుకుతుందని అధికారులు చెబుతున్నారు. భువనగిరి టౌన్లో ఎల్లమ్మ టెంపుల్ నుంచి జగదేవ్పూర్చౌరస్తా, పాత బస్టాండ్, నల్గొండ రోడ్‌లోని స్థలాలను కమర్షియల్జోన్గా పేర్కొన్నారు. చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు సహా పలు మండలాల్లో మెయిన్‌రోడ్డు పరిసరాల్లో ఉన్న భూములను ఎక్కువ విలువైన భూములుగా గుర్తించారు. బొమ్మలరామారం మండలంలో వందకు పైగా గుర్తించిన సర్వే నంబర్లలో సుమారు 60 నంబర్లను ప్రైమ్ల్యాండ్గా పేర్కొన్నారు. వీటిలో బొమ్మలరామారంతోపాటు నాగినేనిపల్లి, మర్యాల, చీకటిమామిడి, రామలింగంపల్లి, రంగాపూర్, మేడిపల్లి గ్రామాలూ ఉన్నాయి.
సవరిస్తే ఎకరం రూ. 1.76 కోట్లు..
గతంలో భూముల మార్కెట్విలువను రూరల్, అర్బన్, కమర్షియల్తేడా లేకుండా ఒకే విధంగా పెంచారు. ఈసారి మాత్రం భూమి అర్బన్‌లో ఉందా..? రూరల్‌లో ఉందా.? కమర్షియలా..? అన్న కోణంలో పరిశీలించి పెంచనున్నారు. దీంతోపాటు భవిష్యత్‌లో రేటు పెరిగే అవకాశమున్న భూమిని కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఒక్కోచోట ఒక్కో విధంగా భూముల మార్కెట్‌విలువ పెరిగే అవకాశం ఉంది. భూముల మార్కెట్విలువను జిల్లాలో 30 నుంచి 40 శాతం పెంచాలని ఆఫీసర్లు సూచించినట్టుగా తెలుస్తోంది.
దీంతో జిల్లాలో భారీ ఎత్తున మార్కెట్‌విలువ పెరిగే అవకాశం కన్పిస్తోంది. ఇదే జరిగితే భువనగిరిలో అత్యధికంగా ఎకరానికి రూ.1.36 కోట్లు ఉన్న భూమికి 30 శాతం మార్కెట్వ్యాల్యూ పెంచితే రూ.1.72 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. భూదాన్ పోచంపల్లిలో ఎకరానికి రూ. 1.18 కోట్లుగా ఉంటే మార్కెట్వ్యాల్యూ పెరిగితే రూ. 1.54 కోట్లకు పెరగనుంది. భువనగిరి మెయిన్‌రోడ్డుపై గజం రూ.32,200 ఉండగా, మార్కెట్వ్యాల్యూ పెరిగిన తర్వాత గజం రూ.42 వేలు అవుతుంది.
ప్రస్తుత మార్కెట్వ్యాల్యూ రూ.1.36 కోట్లు..
భువనగిరి, చౌటుప్పల్, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, ఆలేరు ప్రాంతాల్లోని భూములకు వ్యాల్యూ ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోనే వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాల మార్కెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మార్కెట్వ్యాల్యూ మరీ తక్కువగా ఉంది. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలో ఎకరం ధర రూ. 1.36 కోట్లు, భూదాన్ పోచంపల్లిలో ఎకరానికి రూ. 1.18 కోట్లుగా ఉంది. మిగిలిన చోట్ల రూ.75 వేల నుంచి రూ.50 లక్షల వరకు రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఉంది.
జిల్లాలో ఏ మూలకు వెళ్లినా బహిరంగ మార్కెట్లలో ఎకరాకు రూ.20 లక్షలకు తక్కువ లేదు. మండల హెడ్‌క్వార్టర్‌కు వస్తే ఎకరాకు రూ.కోటికి పైగా అర్బన్ ప్రాంతాలకు వస్తే ఎకరాకు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పలుకుతోంది. ఇక ఇండ్ల స్థలాల విషయానికొస్తే రిజిస్ర్టేషన్వ్యాల్యూ గ్రామాల్లో గజం రూ.800 నుంచి రూ.2200 వరకు ఉంది. అర్బన్ ఏరియాల్లో గజం రూ.9 వేల నుంచి రూ.32,200 వరకు ఉంది. బహిరంగ మార్కెట్విషయానికొస్తే ఏ మారు మూల ప్రాంతానికి వెళ్లినా గజం రూ.5 వేలకు తక్కువగా లేదు. మోత్కూరు, ఆత్మకూరు (ఎం) వంటి మండలాల్లో గజం రూ.20 వేలకు తక్కువగా లేదు. ఇక భువనగిరి, చౌటుప్పల్ ల్లోని నేషనల్హైవేపై గజం రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు పలుకుతోంది.