సాంకేతిక సమస్యతోనే పత్తి కొనుగోళ్లకు బ్రేక్ : ఎండీ షాబొద్దీన్

సాంకేతిక సమస్యతోనే పత్తి కొనుగోళ్లకు బ్రేక్ : ఎండీ షాబొద్దీన్

నస్పూర్/చెన్నూరు, వెలుగు: ఆధార్ సర్వర్ డౌన్ కావడం వల్లే మంచిర్యాల జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్లు  నిలిచిపోయాయని జిల్లా మార్కెటింగ్ అధికారి ఎండీ షాబొద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు. పత్తి కొనుగోలు సమయంలో రైతుకు ఆధార్ ప్రామాణికం కావడం లేదని, ఈ కారణంగానే చెన్నూర్, బెల్లంపల్లి, లక్షెట్టిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు. ఆధార్ సర్వర్ పునరుద్ధరణ తర్వాత పత్తి కొనుగోలు విషయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. రైతులు ఈ విషయాన్ని గమనించి అప్పటివరకు మార్కెట్ యార్డుకు పత్తిని తీసుకురావద్దని కోరారు.

ఎమ్మెల్యేను విమర్శించడం సరికాదు

ఆధార్ సర్వర్ డౌన్ కారణంగానే పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయని, దీనికి ఎమ్మెల్యేను నిందించడం సరికాదని చెన్నూరు కాంగ్రెస్​నేతలు పేర్కొన్నారు. బుధవారం చెన్నూరు లో నిర్వహించిన ప్రెస్ మీట్​లో మాజీ జడ్పీటీసీ చిన్న రామిరెడ్డి మాట్లాడుతూ.. సర్వర్ వునరుద్ధరణ తర్వాత మొత్తం పత్తిని సీసీఐ కోనేలా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అధికారులతో మాట్లాడి చర్యలుతీసున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యను కేవలం చెన్నూరులోనే ఉన్నట్లు, ప్రతిపక్షాలు కావాలని రైతులను తప్పుతో పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలను రైతులు నమ్మొద్దని, త్వరలోనే సీసీఐ పత్తి కొనుగోలు చేపడుతుందని తెలిపారు. మాజీ జడ్పీటీసీ కర్ణసాగర్ రావు, మండలం కాంగ్రెస్ అధ్యక్షులు బాపగౌడ్ తదితరులు పాల్గొన్నారు.