
భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా భారీ నియామక ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా ప్లానింగ్ కమ్యూనికేషన్ ఆఫీసర్, ప్లానింగ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 2325
ప్లానింగ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ (75)
అర్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. మార్కెటింగ్ ఫీల్డ్‌లో అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి.
ప్లానింగ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (375)
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. డిప్లొమా ఇన్ మార్కెటింగ్ చేసి ఉండాలి.
వయసు: 21 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
ప్లానింగ్ అసిస్టెంట్ ( 1875)
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. మార్కెటింగ్ ఫీల్డ్ అనుభవం తప్పనిసరి.
వయసు: 21 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్: మొత్తం 50 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, మార్కెటింగ్, కంప్యూటర్ బేసిక్స్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. సమయం 30 నిమిషాలు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
చివరితేదీ: 30 నవంబర్
వెబ్‌సైట్: bharatiyapashupalan.com
సబ్జెక్ట్ మార్కులు ప్రశ్నలు
హిందీ 10 10
ఇంగ్లిష్ 10 10
మ్యాథ్స్ 10 10
మార్కెటింగ్ 10 10
కంప్యూటర్ బేసిక్స్ 10 10