ఉమ్మడి నిజామాబాద్ జిల్లా

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌/కామారెడ్డి వెలుగు: ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లోని పలు మార్కెట్లు ఆదివారం సందడిగా కనిపించాయి. పండుగ సందర్భంగా బట్టలు, వస్తువులు,  బతుకమ్మ పూల కొనుగోలు కోసం పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో షాపింగ్‌‌‌‌‌‌‌‌ మాల్స్‌‌‌‌‌‌‌‌,  దుకాణాలు కిటకిటలాడాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియా జనంతో నిండిపోయింది. సుభాష్​రోడ్డు, తిలక్​రోడ్డు, మాయబజార్, జేపీఎన్ చౌరస్తాతో పాటు మెయిన్​రోడ్డులో సందడి కనిపించింది. నిజామాబాద్ నగరంలోని పూల మార్కెట్‌‌‌‌‌‌‌‌ కిక్కిరిసిపోయింది. లాడాయి నగరంలోని వీక్లీ మార్కెట్, గంజి మార్కెట్, రైల్వే స్టేషన్​వద్ద బతుకమ్మ పూల కొనుగోలుకు జనం ఎగబడ్డారు.

సబ్‌‌‌‌ జైల్‌‌‌‌కు టీవీల అందజేత

కామారెడ్డి, వెలుగు: ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా జడ్జీ శ్రీదేవి పేర్కొన్నారు. ఆదివారం గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సబ్​జైల్‌‌‌‌‌‌‌‌లో ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌‌‌‌‌‌‌‌ జైల్‌‌‌‌‌‌‌‌కు రెండు టీవీలను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్​ జితేష్ వి పాటిల్, జైలు ఆఫీసర్ గంగా కిషన్ 
పాల్గొన్నారు.

రెండు బైక్‌‌‌‌‌‌‌‌లు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

లింగంపేట, వెలుగు: మండలంలోని సజ్జన్‌‌‌‌‌‌‌‌పల్లి గేట్ వద్ద ఆదివారం రెండు బైక్‌‌‌‌‌‌‌‌లు ఢీకొన్న ఘటనలో ఒకరికి త్రీవ గాయాలైనట్లు ఎస్సై శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మూగూరి నీలకంఠేశ్ తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తూ చౌరస్తా వద్ద తన బైక్ ఆపి మాట్లాడుతున్నాడు. అదే టైంలో నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామానికి చెందిన కుంటోళ్ల రవి అనే వ్యక్తి  లింగంపేట నుంచి నాగిరెడ్డిపేట వైపు బైక్‌‌‌‌‌‌‌‌పై వెళ్తూ అతి వేంగగా వచ్చి నీలకంఠేశ్​బైక్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టాడు. దీంతో ఆయన ఎగిరి రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయమైనట్లు ఎస్సై చెప్పారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నీలకంఠేశ్‌‌‌‌‌‌‌‌ను ఎల్లారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించి అక్కడి డాక్టర్ల సూచనల మేరకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. బాధితుడి తండ్రి మూగూరి పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు ఫైల్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు ఎస్సై తెలిపారు.

అభివృద్ధిపై స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌

కామారెడ్డి, వెలుగు: గ్రామాల్లో అభివృద్ధికి అధిక ప్రయార్టీ ఇస్తున్నట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చెప్పారు. ఆదివారం రామారెడ్డి మండలం అన్నారంలో  సీసీ రోడ్లు, హైమాస్​ లైట్లను ఆయన ప్రారంభించారు.  అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి  సారించారన్నారు. ఆయా రంగాల్లో  తెలంగాణ స్టేట్ దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. జిల్లా లైబ్రరీ చైర్మన్ పున్న రాజేశ్వర్, ఎంపీపీ దశరథ్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. 

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసిన ముజీబుద్దీన్‌‌‌‌‌‌‌‌

కామారెడ్డి, వెలుగు: స్టేట్ ఉర్డూ అకాడమీ చైర్మన్, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఎం.కె ముజీబుద్దీన్‌‌‌‌‌‌‌‌ ఆదివారం సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిశారు. పార్టీ ప్రతినిధులో జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న అనంతరం సీఎం కలిసి జిల్లా రాజకీ యాలపై వివరించినట్లు ముజీబ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

మహాత్మా.. నిను మరువం..

వెలుగు, నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆఫీసర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో ఉన్న గాంధీ విగ్రహాలు, ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్ముడు దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

ఐక్యంగా ఉంటేనే సమస్యల పరిష్కారం

పిట్లం, వెలుగు: హిందువులు ఐక్యంగా ఉంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ విభాగ్​ కార్యావాహ బలవర్తి గణేశ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. వారం రోజులుగా పిట్లంలో నిర్వహించిన ప్రాథమిక శిక్షావర్గ ముగింపు కార్యక్రమంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా గణేశ్‌‌‌‌‌‌‌‌ జాతీయ సవాళ్లు, పీఎఫ్​ఐ, తీవ్రవాదం, దేశాన్ని అస్థిరం చేసే సంఘాలు, రాజకీయ నాయకులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై వక్తలు మాట్లాడారు. ఈ సమస్యలకు సంఘటిత హిందూ శక్తి అవసరమన్నారు. అఖిల భారతీయ విశ్వహిందు పరిషత్​ ధర్మ సంస్థ సభ్యులు సంగ్రాం మహరాజ్​ మాట్లాడుతూ ఆరెస్సెస్​ దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తున్న సంస్థ అన్నారు. ప్రజలందరు సంఘటితమైనప్పుడే దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోగలుగుతామన్నారు.

భారీ వర్షం కురిసినా...

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రాథమిక శిక్షావర్గ ముగింపు కార్యక్రమం ప్రారంభం అయిన అర గంటలకు ఒక్క సారిగా భారీ వర్షం కురిసింది. వర్షానికి వీక్షకులు చెల్లాచెదురై పోగా..  స్వయం సేవకులు మాత్రం దాదాపు 45 నిమిషాలు వర్షంలో తడుస్తూనే వక్తల స్పీచ్ విన్నారు. తడుస్తూనే ప్రార్థనతో కార్యక్రమం ముగించారు. వర్షం కురుస్తున్నా కదలకుండా ఉన్న స్వయం సేవకుల దక్షతను చూసి గ్రామస్తులు ప్రశంసించారు. వారం రోజులుగా నిర్వహించిన శిక్షావర్గలో బాన్సువాడ పట్టణంతో పాటు తొమ్మిది మండలాలకు చెందిన 246 మంది 
పాల్గొన్నారు. 

సాలూర మండల ఆఫీస్‌‌‌‌‌‌‌‌ కోసం ఏర్పాట్లు

బోధన్, వెలుగు: బోధన్​మండలంలోని సాలూర గ్రామాన్ని ప్రభుత్వం ఇటీవల కొత్త మండలంగా ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఆర్డీవో రాజేశ్వర్ మండల ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుకు భవనాన్ని పరిశీలించారు. పాత పంచాయతీ  భవనాన్ని మరమ్మతులు చేసి తాత్కాలికంగా ఉపయోగించుకోవడానికి ఏర్పాట్లు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట మాజీ రైతు బంధు కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్, గ్రామపెద్దలు, గ్రామస్తులు ఉన్నారు.   

నవభారతానికి నాంది జై జవాన్..​ జై కిసాన్

నిజామాబాద్, వెలుగు: జై జవాన్ జై కిసాన్ స్ఫూర్తి నవ భారతానికి నాందిగా నిలించిందని, స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు త్యాగాలు చేసిన వారు చరిత్రలో నిలిచిపోతారని బీజేపీ లీడర్లు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ,  మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలను ఆ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రెసిడెంట్ బస్వా లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కమిటీ సభ్యుడు ధన్‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌ సూర్యనారాయణ మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, ఎర్రం సుధీర్, ఉపాధ్యక్షుడు నాగోల్ల లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్‌‌‌‌‌‌‌‌కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్మీనారాయణ, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, నాయకులు పంచరెడ్డి శ్రీధర్, సురేశ్‌‌‌‌‌‌‌‌బాబు, విజయ్, పోలీస్ శీను, గంగాధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

ముదిరాజ్ మండల అధ్యక్షుడిగా సంజీవ్

మాక్లూర్, వెలుగు: మాక్లూర్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన సంజీవ్‌‌‌‌‌‌‌‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం నిజామాబాద్ అధ్యక్షుడు కరాటే రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా మోహన్, కోశాధికారిగా రవికాంత్, గౌరవ అధ్యక్షుడిగా కిషన్​ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంజీవ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ముదిరాజ్‌‌‌‌‌‌‌‌ల ఐక్యత, అభివృద్ధి కోసం కృషి చేస్తానపన్నారు. కార్యక్రమంలో సతీశ్​, సాయిలు, వినయ్​ రాజు పాల్గొన్నారు.