కుప్పకూలిన మార్కెట్లు.. లాంగ్ కన్సాలిడేషన్ తప్పదా.. ఇప్పుడు ఇన్వెస్టర్లు చేయాల్సింది ఇదే..!

కుప్పకూలిన మార్కెట్లు.. లాంగ్ కన్సాలిడేషన్ తప్పదా.. ఇప్పుడు ఇన్వెస్టర్లు చేయాల్సింది ఇదే..!

ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఇవాళ (ఫిబ్రవరి 24) భారీగా కుప్పకూలాయి. గత వారం పూర్తిగా వొలటైల్ గా ఉన్న మార్కె్ట్లు అప్పుడప్పుడు పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తూ ఇన్వెస్టర్లలో ఆశలు క్రియేట్ చేశాయి. కానీ ఇవాళ ఓపెనింగ్ నుండే నెగెటివ్ గా స్టార్ట్ అవుతూ.. సెషన్ ఎండ్ అయ్యే టైమ్ కు భారీగా పడిపోయాయి. 

నిఫ్టీ ఫిఫ్టీ 242.55 పాయింట్లు నష్టపోయి 22,553 కు చేరుకుంది. సెన్సెక్స్ 856.65 పాయిట్లు కోల్పోయి 74,454.41 వద్ద క్లాజ్ అయ్యింది. నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ 22,800 లెవల్ బ్రేక్ అయ్యి దూరంగా ఎండ్ అవ్వడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. 

ఇవాళ్టి సెషన్ లో జోమాటో, హెచ్ సీఎల్, టీసీఎస్, టెక్ మహీంద్ర, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఇందస్ ఇండ్ బ్యాంక్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. అదే సమయంలో సన్ ఫార్మా, మారుతి, ఎమ్ అండ్ ఎమ్, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్ట్లే ఇండియా లాభాల్లో ముగిశాయి. 

మార్కెట్ల పతనానికి కారణం:

యూఎస్ ఎకానమీలో వస్తున్న స్లో డౌన్ తో ఇండియన్ మార్కెట్లు దారుణంగా పడిపోయాయి. యూఎస్ ఎకానమి స్లో డౌన్ కారణంగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. దీంతో యూఎస్ లో పెట్టుబడులు పెడితే లాభం వచ్చే అవకాశం ఉందని ఫారిన్ ఇన్వెస్టర్లు ఎక్కువ మొత్తంలో ఇండియన్ మార్కెట్ నుంచి అమ్మకాలు జరుపుతున్నారు. అదే విధంగా యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగుతుండటం, ప్రపంచ ఆర్థిక స్థితి మందగనంలో ఉన్నపుడు స్థిరమైన లాభాలను ఇచ్చే బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్ గా ఎఫ్ఐఐ (ఫారిన్ ఇన్వెస్టర్లు ) భావించి భారీగా అమ్మకాలకు దిగుతున్నారు. 

ఇండియన్ రూపీ భారీగా పతనం కూడా ఎఫ్ఐఐల అమ్మకాలకు ఒక కారణం. రూపీ పతనంతో ఇండియాలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు తగ్గడం సహజం. అదే టైమ్ లో డాలర్ పెరగటం, బాండ్స్ నుంచి వచ్చే లాభాలు పెరుగుతాయనే ఆశాభావంతో ఇండియన్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. 

మరోవైపు రెసిప్రోకల్ టారిఫ్స్ పెంచుతున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో కూడా ఇండియన్ మార్కెట్లు పతనం దిశగా వెళ్లాయి. యూఎస్ ఆర్థిక వ్యవస్థ స్లో డౌన్ వలన భారత్ - యూఎస్ ట్రేడ్ తగ్గుతుంది. ఇండియాకు అత్యధికంగా వాణిజ్యం ఉన్నది యూఎస్ తోనే. ఈ టైమ్ లో అమెరికా ఆర్థిక వ్యవస్థలో స్థబ్దత కారణంగా వాణిజ్యంలో మందగమనం ఉంటుందని మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు వెళ్లిపోతున్నారు.

ఇటీవల విడుదలైన ఇండియన్ కంపెనీల రిజల్ట్స్ కూడా ఆశించినంత గొప్పగా ఉండక పోవడం, కంపెనీల రెవెన్యూ స్లో డౌన్ అవ్వడం కూడా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. 2025లో మొత్తం లక్ష కోట్లకు పైగా (రూ.1,01,737 కోట్లు) అమ్మేశారు. దీంతో మార్కెట్లు ఘోరంగా పడిపోతున్నాయి. 

లాంగ్ కన్సాలిడేషన్ తప్పదా..? 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయిన నాటి నుంచి ఇండియన్ మార్కెట్లు స్లోగా ఫాల్ మొదలైంది. ఆ తర్వాత ఇటీవలే ట్రంప్ యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మార్కెట్లలో ఘోరమైన అమ్మకాలు జరుగుతున్నాయి. 26 వేల పైన ఉన్న నిఫ్టీ పడుతూ పడుతూ 23 వేల దిగువకు పడిపోయింది. అయితే 22,800 స్ట్రాంగ్ సప్పోర్ట్ కు దిగువన పడనంత వరకు ఎలాంటి భయం లేదని ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ధీమాగా ఉంటూ వస్తున్నారు. 

పోర్ట్ ఫోలియోలు 30 నుంచి 70 శాతం పడిపోయినా.. 22,800 సప్పోర్ట్ బ్రేక్ కానంత వరకు ప్రాబ్లమ్ లేదని, అక్కడి నుంచి మళ్లీ మార్కెట్ పుంజుకుంటుందని ఎనలిస్టులు భావిస్తూ వచ్చారు. కానీ ఇవాళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ కావడంతో ఇక మార్కెట్ మరింత పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఇక నుంచి కొన్నాళ్ల పాటు లాంగ్ కన్సాలిడేషన్ తప్పేలా లేదని అంటున్నారు. అంటే మార్కెట్లు పెరగకుండా ఒక రేంజ్ లో కొనసాగే అవకాశం ఉంది. కన్సాలిడేషన్ ఫేజ్ లో మార్కెట్లో అంతగా లాభాలు ఉండవు. దీంతో ఈ టైమ్ లో ఇన్వెస్టర్లు టైమ్ కరెక్షన్ ను చవిచూడక తప్పదు.

ఇన్వెస్టర్లు ఏం చేయాలి..?

నిప్టీ  22,800 సప్పోర్ట్ బ్రేక్ చేయడంతో ఈ ఫాల్ 22,700 వరకు ఉండవచ్చునని, అదీ బ్రేక్ అయితే 22,500 వరకు ఉండవచ్చునని అంటున్నారు. ఈ దశలో మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉంటుందని అంటున్నారు. అది నెలలు కావచ్చు.. లేదంటే సంవత్సరాల పాటు కూడా కన్సాలిడేషన్ ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇక కొన్నాళ్లు లాభాలు రాని పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఏం చేయాలన్నదే ప్రశ్న.

కొత్తగా వచ్చిన రిటైల్ ఇన్వెస్టర్లు ఇక లాభాలు రావు అని ఎక్జిట్ అవ్వాలని చూస్తుంటారు. అయితే అలా చేయడం మరింత నష్టాన్నే ఇస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే పోర్ట్ ఫోలియోలు 30 నుంచి 70 శాతం నష్టాల్లో ఉన్నాయి. ఈ టైమ్ లో అమ్ముకుంటే ఆ నష్టాలను భరించాల్సి ఉంటుంది. 

మరికొంత మంది మార్కెట్లు పడుతున్నాయి కదా అని మరింతగా యావరేజ్ చేద్దామని చూస్తుంటారు. బుల్ మార్కెట్లో యావరేజ్ చేయడం మంచి ఆలోచన. కానీ ఇప్పుడు నడుస్తున్న బేర్ మార్కెట్లో.. అదీ కన్సాలిడేషన్ స్టేజ్ లో యావరేజ్ చేయడం వలన లాభం లేదు. ఎందుకంటే ఇప్పట్లో మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో అంచనా వేయడం కష్టం. పెట్టుబడులు భారీగా పెట్టి యావరేజ్ చేయడం వలన చాలా రోజులు ఆ నష్టాల్లోనే ఉండాల్సి వస్తుంది. 

కొందరు వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతుంటారు. దీంతో వడ్డీ భారం పడక తప్పదు. అందుకే మార్కెట్ లో రివర్సల్ కన్ఫామ్ అయ్యే వరకు ఆగితే మంచిది. మార్కెట్లో బుల్ జోష్ వచ్చి.. ఇంపార్టెంట్ రెసిస్టెంట్స్ దాటి పెరగటం ప్రారంభిస్తే.. అది కన్ఫామ్ చేసుకుని అప్పుడు యావరేజ్, పిరమిడ్ చేసుకోవడం ఉత్తమం.