- సెన్సెక్స్ 741 పాయింట్లు అప్,23,500 పైన నిఫ్టీ
న్యూఢిల్లీ: ఈసారి గ్రోత్ ఆధారిత బడ్జెట్ ఉంటుందని ఎకనామిక్ సర్వే సంకేతాలు ఇవ్వడంతో మార్కెట్లు శుక్రవారం పుంజుకున్నాయి. సెన్సెక్స్741 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 23,500 ఎగువన ముగిసింది. సెన్సెక్స్740.76 పాయింట్ల లాభంతో 77,500 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 846 పాయింట్ల వరకు దూసుకెళ్లింది.
నిఫ్టీ 258.90 పాయింట్లు ర్యాలీ చేసి 23,508.40 వద్ద సెటిలయింది. ఇంట్రాడేలో 297 పాయింట్లు ఎగిసింది. సెన్సెక్స్‌లో ఎల్ అండ్ టీ, నెస్లే, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, టాటా మోట ర్స్, టాటా స్టీల్, ఐటీసీ, మారుతి లాభపడ్డాయి.
ఆసియాలో టోక్యో లాభపడగా, సియోల్ నష్టపోయింది. సెలవు వల్ల షాంఘై, హాంగ్‌కాంగ్ మార్కెట్లు పనిచేయలేదు. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యూఎస్ మార్కెట్లు గురువారం లాభపడ్డాయి. ఎఫ్ఐఐలు గురువారం రూ.4,582.95 కోట్ల ఈక్విటీలను అమ్మారు.