మొక్కజొన్న కొనుగోళ్లకు నిర్మల్ జిల్లాలో ఐదు సెంటర్లు

మొక్కజొన్న కొనుగోళ్లకు నిర్మల్ జిల్లాలో ఐదు సెంటర్లు

నిర్మల్, వెలుగు: మొక్కజొన్న కొనుగోళ్లపై ఆందోళనకు గురవుతున్న రైతులకు మార్క్ ఫెడ్ సంస్థ శుభవార్త చెప్పింది. కొద్ది రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్లను చేపట్టనున్నట్లు మార్క్​ఫెడ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదట జిల్లా వ్యాప్తంగా ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 

నిర్మల్, ఖానాపూర్, సారంగాపూర్, కుభీర్, భైంసాలో కొనుగోలు కేంద్రాలను ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. క్వింటాలుకు రూ.2,225 మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు దళారులకు తమ పంటను అమ్ముకొని మోసపోవద్దన్నారు.