
ప్రపంచంలోని క్లాసికల్ బ్యాటర్ల లిస్ట్ లో సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఐడెన్ మార్క్రామ్ కూడా ఉంటాడు. అతను కొట్టే కవర్ డ్రైవ్, లాఫ్టడ్ షాట్స్ క్రికెట్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఐపీఎల్ లో మంగళవారం (ఏప్రిల్ 22) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మార్కరం తన సొగసైన షాట్ తో అందరినీ ఫిదా చేశాడు. లక్నో సూపర్ జయింట్స్ తరపున ఓపెనింగ్ చేస్తున్న మార్క్రామ్ నాలుగో ఓవర్ మూడో బంతికి కొట్టిన స్ట్రయిట్ సిక్సర్ ఔరా అనిపించింది.
ముకేశ్ కుమార్ వేసిన లెంగ్త్ డెలివరీని స్ట్రెయిట్ లాంగ్-ఆన్ దిశగా ఆడాడు. ఎంతో అందంగా కొట్టిన ఈ షాట్ వికెట్ కీపర్ రాహుల్ ను సైతం మెప్పించడం విశేషం. ఈ ఐపీఎల్ సీజన్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్ అని చెప్పుకోవచ్చు. అంతకముందు స్టార్క్ వేసిన రెండో ఓవర్లో మిడ్ వికెట్ దిశగా తన తొలి సిక్సర్ అద్భుతంగా కొట్టాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మార్కరం అదరగొడుతున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.
మార్కరంతో పాటు మరో ఎండ్ లో మిచెల్ మార్ష్ కూడా రాణించడంతో లక్నో తొలి 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. మార్కరం 52 పరుగులు చేసి చమీర బౌలింగ్ లో ఔటయ్యాడు. మార్ష్ 35 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.