ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండడం గ్యారంటీ. ఈ రెండు జట్లు టెస్ట్ క్రికెట్ లో అసలైన మజాను చూపిస్తాయి. అగ్ర జట్లు.. స్టార్ ఆటగాళ్లు.. స్టేడియం నిండా ప్రేక్షకులు.. వెరసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసక్తికరంగా మారుస్తాయి. మరోసారి ఈ మెగా సిరీస్ అభిమానులకు కిక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సిరీస్ పై ఆసీస్ స్టార్ బ్యాటర్ మార్నస్ లాబుస్‌చాగ్నే మాట్లాడాడు.
స్టార్ స్పోర్ట్స్‌లో లాబుస్‌చాగ్నే మాట్లాడుతూ.."ఆస్ట్రేలియా, భారత్ సిరీస్ చూడడానికి అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. మ్యాచ్ ఎక్కడ జరిగినా క్రేజ్ తగ్గదు. టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగుంది. ఆస్ట్రేలియా పిచ్ లపై భారత బౌలింగ్ ఎదర్కోవడం మాకు ఛాలెంజ్" అని ఈ ఆసీస్ స్టార్ బ్యాటర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భారత బౌలింగ్ బుమ్రా, షమీ, సిరాజ్ లతో పటిష్టంగా కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ విదేశాల్లో విజయాలు సాధించడంలో వీరు కీలక పాత్ర పోషించారు.
ALSO READ | ఆదుకున్న శ్రేయస్, పడిక్కల్.. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 206/8
రోహిత్ శర్మ కెప్టెన్ గా భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం.
இந்தியாவின் Fast Bowling Lineup மிகவும் அற்புதம்! - Marnus Labuschagne 💯#ToughestRivalry #BGTOnStar #BorderGavaskarTrophy pic.twitter.com/dFoMtL2L14
— Star Sports Tamil (@StarSportsTamil) September 6, 2024