తల్లి దీవెన ముందు విధి ఓడిన వేళ..లబుషేన్ గ్రేట్ ఇన్నింగ్స్ వెనుక మిస్టరీ

తల్లి దీవెన ముందు విధి ఓడిన వేళ..లబుషేన్ గ్రేట్ ఇన్నింగ్స్  వెనుక మిస్టరీ

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఇటీవలే టీ 20 సిరీస్ ని ముగించుకొని నిన్న తొలి వన్డే ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా ఇన్నింగ్స్ కంటే ఆసీస్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు లబుషేన్ ఆడిన ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకమనే చెప్పుకోవాలి. గ్రీన్ గాయపడడంతో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మార్నస్.. సంచలన ఇన్నింగ్స్‌ ఆడి జట్టుని విజయతీరాలకు చేర్చాడు. ఇంతవరకు అందరికీ తెలిసినా తాజాగా అసలు మిస్టరీ బయట పెట్టాడు ఈ ఆసీస్ బ్యాటర్. 

ALSO READ :సూపర్ సండే : ఆరోజు మిస్ అయితే సూపర్ మండే : ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్

అమ్మ దీవెనె ఆడేలా చేసింది 

దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో లబుషేన్ కి ప్లేయింగ్ 11 లో చోటు దక్కలేదు. అయితే మ్యాచ్‌లో తాను బాగా ఆడతానని వాళ్ల అమ్మ అతనితో చెప్పిందట. నిజానికి అప్పటికే తాను ప్లేయింగ్‌ ఎలెవన్‌లో లేను అనే విషయం లబుషేన్‌కు తెలుసు​. కానీ కట్ చేస్తే.. కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి 80 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 223 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఒక దశలో ఆసీస్ 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినా ఎంతో ఓపికతో చివర వరకు క్రీజ్ లో ఆసీస్ కి అనూహ్య విజయాన్ని అందించాడు. తన కొడుకు మీద లబుషేన్‌ తల్లికి ఎంత బలమైన   నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. తల్లి దీవెన ముందు విధి కూడా వెనుకంజ వేయాల్సిందేనని మరోసారి నిరూపించబడింది.