T20 Blast: 15 బంతుల్లో 5 వికెట్లు.. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్పిన్ మ్యాజిక్

T20 Blast: 15 బంతుల్లో 5 వికెట్లు.. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్పిన్ మ్యాజిక్

ఆస్ట్రేలియా టెస్ట్ స్పెషలిస్ట్ మార్నస్ లాబుస్‌చాగ్నే స్టార్ బ్యాటర్ గా క్రికెట్ లో తన మార్క్ చూపించాడు. పార్ట్ టైం స్పిన్నర్ గా అప్పుడప్పుడూ వికెట్లు తీస్తూ సత్తా చాటతాడు. తాజాగా ఒక సూపర్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ లో భాగంగా 15 బంతుల్లో 5 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. గ్లామోర్గాన్  తరపున ఆడుతున్న లాబుస్‌చాగ్నే.. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. 

కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో సోమర్‌సెట్‌ 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. భారీ లక్ష్యం కావడంతో వేగంగా ఆడే క్రమంలో బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో  మార్నస్ తన బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు. చివరి 5 వికెట్లను తీసుకొని మ్యాచ్ ను త్వరగా ముగించాడు. ఇతని ధాటికి సోమర్సెట్ లోయర్ ఆర్డర్ ఆటగాళ్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఐదు వికెట్లలో బెన్ గ్రీన్ ను బౌల్డ్ చేయడం హైలెట్ గా నిలిచింది. 

ALSO READ | వారిద్దరి వల్లే పాకిస్థాన్ పై విజయం: హర్మన్‌ప్రీత్ కౌర్

ఈ మ్యాచ్ లో మొత్తం 2.3 ఓవర్లు బౌలింగ్ వేసిన లాబుస్‌చాగ్నే ఒక మేడిన్ తో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి ఇచ్చాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన గ్లామోర్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఓపెనర్ 64 బంతుల్లో 135 పరుగులు చేసి విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. లక్ష్య ఛేదనలో 123 పరుగులకు ఆలౌటైంది. దీంతో  గ్లామోర్గాన్ 120 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.