Marri Chettu Kinda Manollu: మర్రిచెట్టు కింద మనోళ్ళు సినిమా షూటింగ్ మొదలైంది..

Marri Chettu Kinda Manollu: మర్రిచెట్టు కింద మనోళ్ళు సినిమా షూటింగ్ మొదలైంది..

ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన, ముస్కాన్ రాజేంద‌‌‌‌‌‌‌‌ర్ హీరోహీరోయిన్లుగా నరేష్ వర్మ ముద్దం దర్శకత్వం వహిస్తున్న  చిత్రం ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’. శ్రీ నారసింహ చిత్రాలయ సంస్థ నిర్మిస్తోంది. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

న‌‌‌‌‌‌‌‌టుడు బాబు మోహన్ న‌‌‌‌‌‌‌‌టీన‌‌‌‌‌‌‌‌టుల‌‌‌‌‌‌‌‌పై క్లాప్ కొట్టారు.  ఆర్టిస్టు నాగ మహేష్ కెమెరా స్విచాన్ చేయగా,  పృథ్వీ, రాజీవ్ కనకాల, తెలుగు ఫిలించాంబ‌‌‌‌‌‌‌‌ర్ అధ్యక్షులు దామోద‌‌‌‌‌‌‌‌ర ప్రసాద్, నిర్మాత  సి.కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర యూనిట్‌‌‌‌‌‌‌‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి ఒక్కరినీ అలరించే విధంగా మంచి సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు నరేష్ వర్మ చెప్పాడు. ఈ సినిమా తమ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హెల్ప్ అవుతుందనే నమ్మకం ఉందని నటీనటులు అన్నారు.