కాంగ్రెస్ పాలనలో రైతుల కళ్లలో కన్నీళ్లు : మర్రి జనార్దన్ రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : గత పాలనలో కాంగ్రెస్ రైతుల కళ్లలో కన్నీళ్లు తెప్పించిందని బీఆర్​ఎస్​అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం తాడూరు మండలం పాపగల్, శిరసావాడ, ఐతోలు, బలన్ పల్లి, గోవిందాయ పల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారంటీ లేని పార్టీ గ్యారెంటీలను ఎవరూ నమ్మ రన్నారు.  గతంలో ఇల్లును, కుటుంబాన్ని వదిలేసి వలస వెళ్లిన వారి గురించి ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.

ALSO READ :  అభివృద్ధి చేసా.. మరో అవకాశం ఇవ్వండి : మంత్రి నిరంజన్ రెడ్డి 

నేడు సాగునీరు రావడంతో వలసలు వెళ్లిన వారందరూ వచ్చి తమ పనులు చేసుకుంటున్నారని చెప్పారు. రైతుల కళ్లలో ఆనందం చూస్తున్నామన్నారు. ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక కార్యక్రమాలు  చేపడతానని భరోసా ఇచ్చారు.  ఎమ్మెల్యే సతీమణి మర్రి జమున నాగర్ కర్నూల్ పట్టణంలో షాప్ టు షాప్ తిరిగి ప్రచారం నిర్వహించారు.