హైదరాబాద్, వెలుగు : నేషనల్ మాస్టర్స్ గేమ్స్‌లో హైదరాబాద్ మాస్టర్ స్విమ్మర్, ఎంఎల్ఆర్ఐటీ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు.
మాస్టర్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుజరాత్‌లోని విద్యానగర్‌లో ఆదివారం జరిగిన 80 ప్లస్ ఏజ్ గ్రూప్ 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ ఫైనల్లో 4 నిమిషాల 16.59 సెకండ్ల టైమింగ్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచారు. 100 ఫ్రీ స్టయిల్లోనూ 3 నిమిషాల 32:50 సెకండ్ల అగ్రస్థానంతో గోల్డ్ కైవసం చేసుకున్నారు.