చీర బాలేదని ప్రేమపెళ్లి రద్దు

చీర బాలేదని ప్రేమపెళ్లి రద్దు

చీర బాలేదని పెళ్లి రద్దైన విచిత్ర సంఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలోని హసన్ పట్టణానికి చెందిన రఘుకుమార్, సంగీతలు సంవత్సరం కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ వారివారి కుటుంబాల సమ్మతితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో వాళ్లకు చెప్పి వాళ్లను పెళ్లికి కూడా ఒప్పించారు. పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొని.. పెళ్లికి కావలసిన షాపింగ్ కూడా చేశారు. అయితే పెళ్లి కోసం పెళ్లికూతురు తీసుకున్న చీర, అబ్బాయి తల్లిదండ్రులకు నచ్చలేదు. చీర నాణ్యత బాగాలేదని.. ఆ చీరను ఎక్సేంజ్ చేసుకోవాలని చెప్పారు. అందుకు అమ్మాయి ఒప్పుకోలేదు. దాంతో అబ్బాయి తల్లిదండ్రులు ఏకంగా పెళ్లినే రద్దు చేశారు. అంతేకాకుండా.. రఘుకుమార్‌ని ఎక్కడికైనా పారిపోవాలని కూడా సలహా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ‘రఘుకుమార్ పై మోసం కేసు నమోదు చేశాం. అతడిప్పుడు పరారీలో ఉన్నాడు’ అని హసన్ పోలీస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గౌడ తెలిపారు. వరుడి తల్లిదండ్రులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

For More News..

మెట్రో స్టేషన్ సమీపంలో యంగ్ లేడీ ఎస్సై హత్య

కరోనా వైరస్‌కు టీకా? ఇండియన్‌  సైంటిస్ట్ ముందడుగు

హైదరాబాద్‌లో చెత్తకుప్పలో పేలుడు