పెళ్లి తంతులో ఏడడుగులు ఎందుకు వేయిస్తారు... వాటి వెనుక ఉన్న అర్థాలు తెలుసా..

పెళ్లి తంతులో ఏడడుగులు ఎందుకు వేయిస్తారు... వాటి వెనుక ఉన్న అర్థాలు తెలుసా..

తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్లు..' పెళ్లి గురించి 'మనసు కవి' ఆత్రేయ రాసిన Magician అద్భుతమైన పాట ఇది. పెళ్లికి, జీవితానికి ఉన్న అందమైన సంబంధం గురించి చెప్పారు ఈ పాటలో. పెళ్లిలో జరిగే ప్రతి కార్యం వెనుక ఏదో ఒక అర్థం ఉంది అంటారు పెద్దలు. అవి పెళ్లయిన తర్వాత భార్యాభర్తలు ఎలా కలిసి బతుకుతారో చెప్తాయంటారు.. అసలు పెళ్లి తంతులో ఏడు అడుగులను ఎందుకు నడిపిస్తారు.. వాటి వెనుక ఉన్న అర్దం ఏమిటో తెలుసుకుందాం.. . 

పెళ్లిలో ఏడడుగులు కలిసి నడవడం  అంటే మామూలుగా ఏడు అడుగులు వేయడం కాదు. బ్రాహ్మణుడు నడవమన్నాడు. పెళ్లికొచ్చినోళ్లు చూస్తున్నారు. ఏడడుగులు వెయ్యకపోతే బాగుండదు. అందుకే ఏడడుగులు వేస్తున్నాం అనుకోకూడదు. వాటి వెనకున్న అర్థం, పరమార్థం తెలుసుకోవాలి. సప్తపదిలో వేసీ ప్రతి అడుక్కి ఒక లెక్కుంది. ఆ లెక్క వెనుక తెలుసుకోవాల్సిన జీవనసత్యం ఉంది.

Also Read :- పిల్లల విషయంలో అతి జోక్యం వద్దు

కలసి బతుకుదాం..

పెళ్లిలో వధూవరులు కొంగు ముడేసిన తర్వాత అగ్ని చుట్టూ తిరుగుతారు. వేరువేరు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు తోడునీడగా ఉంటామని ప్రమాణం చేస్తారు. కుడికాలితో మొదలుపెట్టి ఉత్తరం దిక్కుగా హోమం చుట్టూ తిరుగుతూ ఏడడుగులు వేస్తారు. భార్యాభర్తలు స్నేహంగా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, అన్యోన్యంగా జీవించాలని చెప్పేదే సప్తపది. దీనిలో దేవుళ్లలోని విష్ణువు ప్రస్తావన కనిపిస్తుంది.

  • ఒకటి: విష్ణువు భార్యాభర్తలని ఒకటి చేయాలని కోరుకోవడం 
  • రెండు: విష్ణువు ఇద్దరికీ శక్తి ఇవ్వాలని కోరుకోవడం
  • మూడు: ఇద్దరికీ పెళ్లి అయినట్లు ఆశీర్వదించాలని భావించడం
  • నాలుగు: విష్ణువు సంతోషం ఇవ్వడం
  • ఐదు: పశుసంపద ఇవ్వడం
  • ఆరు రుతువులకు అనుకూలంగా జీవితం సుఖంగా ఉండాలి.
  • ఏడు: కుటుంబానికి సంబంధించిన అన్ని పనులు చేయాలని విష్ణువు ఆశీర్వదించడం.

ఏడు అడుగుల్లోనే అందమైన జీవితం

వివాహం అయిన తర్వాత కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత భార్యాభర్తలు ఇద్దరిమీదా ఉంటుంది. అందుకు శారీరక బలం అవసరం. అందుకే మొదటి అడుగు వాళ్ల శరీరాల బలానికి సంబంధించిందంటారు. రెండో అడుగు మానసికమైంది. అంటే ఇద్దరూ మానసికంగా కలిసిమెలిసి బతకాలి. గొడవలు వచ్చినా, అభిప్రాయాలు వేరైనా మానసికంగా కలిసుండాలనే గట్టి నిర్ణయంతో ఉండాలి. అలాగే ఒకరిపై మరొకరికి నమ్మకం ముఖ్యం. అందుకే రెండో అడుగు మానసికమైందని అంటారు. ధర్మం, నీతి, విలువలకు కట్టుబడి భార్యాభర్తలు జీవితాన్ని కొనసాగించాలి. ఒకరు ఎడం అంటే మరొకరు కుడి అంటే కాపురం నడవదు. అందుకే మూడో అడుగు ధర్మం తప్పకుండా ఇద్దరూ బతకాలని చెప్తుంది. భార్యాభర్తలిద్దరూ పిల్లాపాపలతో కుటుంబాన్ని వృద్ధి చేయాలి. అందువల్ల నాలుగో అడుగు సంసారసుఖాన్ని తెలియజేస్తుంది.

 పంట బాగా పండితేనే తిండి దొరుకుతుంది. అదీగాక మనది వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. అందుకే పశువుల గురించిన ప్రస్తావన పెళ్లిలో కూడా ఉంది. భార్యాభర్తలిద్దరూ పశువులను సాకుతూ, వ్యవసాయం చక్కగా సాగాలని ఐదో అడుగు వేస్తారట. మనుషులకు అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యం. అది సరిగ్గా లేనప్పుడు కుటుంబం అనే బాధ్యతలు నిర్వర్తించలేరు.. అందుకే వాతావరణ మార్పులు, రుతువులకు అనుగుణంగా ఆరోగ్యం బాగుండాలని ఆరో అడుగు వేస్తారు. కుటుంబం అనే బండికి రెండు చక్రాల్లాంటి భార్యాభర్తలిద్దరూ ఎన్ని కష్టాలొచ్చినా విడిపోకుండా సఖ్యతతో బతుకుతామని చెప్పేదే ఏడో అడుగు. ఇలా ఏడు అడుగులకు వాళ్ల భవిష్యత్ జీవితానికి సంబంధం ఉంది.

చెరిసగం

సప్తపదిలో వధూవరులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్లు! కొన్ని మంత్రాలు చెప్తారు. వాటి అర్థం కూడా ఒకరిపై మరొకరు వినయవిధేయతతో జీవించాలనే. పెళ్లికొడుకు పెళ్లి కూతురితో ' ఈ ఏడు అడుగులు నడవడం వల్ల నువ్వు నాకు మంచి స్నేహితురాలివి. అయ్యావు. ఇప్పటి నుంచి నాతో ఉండు. ఎప్పుడూ వదిలిపెట్టి పోవద్దు. భేదాలు వచ్చినా, ఆలోచనలు పంచుకుంటూ కలిసి ఉందాం. మన బంధం శాశ్వతంగా ఉండాలి' అంటాడు. అందుకు పెళ్లికూతురు "నువ్వు ఎలాంటి పొరపాటు చేయకుండా ఉండు. నేను కూడా అలాగే ఉంటా. కలిసి జీవిద్దాం. నువ్వు ఆకాశం అయితే, నేను భూమి. నువ్వు మనసు అయితే నేను మాట. ఇద్దరిలో 
ఎలాంటి తేడా ఉండకూడదు. కష్టసుఖాలు కలిసే పంచుకుందాం' అంటుంది. అందుకు పెళ్లి కొడుకు సమాధానం చెప్తూ "మనం మంచి బిడ్డలను కందాం. బలం, ధైర్యం, తెలివితేటలున్న వాళ్లు మన వారసత్వాన్ని నిలబెడతారు. అందువల్ల మంచి మార్గంలో బతికే సంతానాన్ని పొందుదాం' అంటాడు