
మామిడి చెట్లకు పెళ్లి చేయడం ఏంటి అనుకుంటున్నారా.. అవును ఆ ఊళ్ళో మామిడి చెట్లకు పెళ్లి చేశారు.. అచ్చం మనుషుల పెళ్లి లాగానే మామిడి చెట్లకు కొత్త బట్టలు కట్టి.. జీలకర్ర బెల్లం ఉంచి మాంగల్యధారణ చేశారు. జగిత్యాల జిల్లా బీర్ పూర్ లో జరిగింది ఈ అరుదైన ఘటన. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. బీర్ పూర్ మండలం తుంగూర్ కి చెందిన మామిడి తోట ఈ పెళ్ళికి వేదిక అయ్యింది.
అనిలా అజయ్ లకు చెందిన 8 ఎకరాల మామిడితోటలో నాలుగేళ్ళ తర్వాత మొదటి కాత వచ్చింది.. దీంతో కాత కాసిన రెండు మామిడి చెట్లకు పెళ్లి చేశారు. పెళ్లి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు దంపతులు. అచ్చంగా మనుషుల పెళ్లి లాగే చెట్లకు కొత్త బట్టలు కట్టి.. జీలకర్ర బెల్లం ఉంచి మాంగల్యధారణ చేశారు.
►ALSO READ | మనుమరాళ్లకు సైతం మొక్కల పేర్లే.. ఇంట్రెస్టింగ్గా వనజీవి రామయ్య లైఫ్ స్టైల్
వైభవంగా జరిగిన ఈ పెళ్ళికి కార్యక్రమానికి గ్రామంలోని పలువురు రైతులు హాజరయ్యారు. పెళ్ళికి వచ్చిన అతిధులకు మామిడితోటలోనే సహపంక్తి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.