మనస్పర్థలతో పీటల మీద ఆగిన పెండ్లి

నందిపేట, వెలుగు:  నిజామాబాద్​ జిల్లా నందిపేట మండలంలోని ఓ గ్రామంలో  మరో గంటలో వధువు ఇంటి వద్ద పెళ్లి జరగనుండగా, మనస్పర్థలు రావడంతో  పీటల మీద పెళ్లి ఆగిపోయింది.  సదరు గ్రామానికి చెందిన యువతికి,  వేల్పూర్​మండలానికి చెందిన యువకుడితో శుక్రవారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కోసం ఇరువైపుల బంధువులు హాజరయ్యారు.  వధువు తరపు వారు తమను పట్టించుకోవడం లేదని వరుడి బంధువులు, కట్నం డబ్బుల కోసం ఇబ్బందులు పెడ్తున్నారని వధువు తరపు వారు ఒకరినొకరు దూషించుకున్నారు. ఇంతలో పెళ్లి కొడుకు తరపు వారు పెళ్లికాకుండానే  వెళ్లిపోవడంతో  పెళ్లాగిపోయింది. ఈ విషయమై రాత్రి వధువు తరపు వారు పోలీసుస్టేషన్​కు వెళ్లినట్లు 
సమాచారం.