రెండు రోజుల్లో పెళ్లి.. అంతలో విషాదం

రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వరుడ్ని రోడ్డు ప్రమాదం కబళించింది. ఈ ప్రమాదంలో వరుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన వరంగల్​లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..   నగరంలోని రామన్నపేటకు చెందిన దేవరకొండ సాగర్​చారి(28) తన పెళ్లి పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. 

నగరంలోని నిర్మల మాల్ వద్ద బైక్​పై రోడ్డు క్రాస్​ చేస్తుండగా, వేగంగా వచ్చిన మరో బైక్​ అతడ్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన సాగర్​ అక్కడికక్కడే మృతి చెందాడు.  మరో రెండు రోజుల్లో పెళ్లితో కళకళలాడాల్సిన ఇంట్లో సాగర్​ మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.  చేతికందివచ్చిన కుమారుడు దూరం కావడంతో కుటుంబ సభ్యుల రోదన అరణ్యవేదనగా మారింది.