దీపావళి తరువాత లగ్గాలు ప్రారంభంకానున్నాయి. మూడు నెలల నుంచి ఒక్కటయ్యేందుకు ఎదురుచూస్తున్న వధూవరులు పెళ్లి సంబరాల టైం వచ్చేసింది. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాండ్ భాజాలు మోగనున్నాయి. దీనికి రూ.6 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది.
2024 నవంబర్ లో వివాహం ముహూర్తాలు
సహజంగా 2024 నవంబర్ లో శుభ వివాహం తేదీలు నెల చల్లగా, వేడిగా ఉండదు. ఈ నెల ఎంతో అందంగా ఉంటుంది. ఈ నెలలో మీరు ఎంచక్కా పెళ్లిపీఠలు ఎక్కొచ్చు. అందమైన శరదృతువులో పెళ్లిళ్లు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి ఈ నెలలో ( 2024 నవంబర్) ఏయే తేదీల్లో పెళ్లిళ్లు చేసుకోవచ్చంటే... నవంబర్ 12 (మంగళవారం), నవంబర్ 13 (బుధవారం), 17 (ఆదివారం), 18 (సోమవారం), 22 (శుక్రవారం), 23 (శనివారం), 25 (సోమవారం), 26 (మంగళవారం), 28 (గురువారం), 29 (శుక్రవారం).
Also Read :- రోజూ 30 నిమిషాల వాకింగ్తో ఎంతో ఆరోగ్యం
2024 డిసెంబర్ లో వివాహం ముహూర్తాలు
సంవత్సరపు చివరి నెల అయిన డిసెంబర్ లో పెళ్లిళ్లు చేసుకోవడానికి అద్భుతమైన సమయం. శీతాకాలాన్ని ఇష్టపడేవారికి ఇది బాగా సరిపోతుంది. ఈ సమయంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. మరి ఈ నెలలో ఏయే తేదిన పెళ్లిళ్లు చేసుకోవచ్చంటే: డిసెంబర్ 4 (బుధవారం), 5 (గురువారం), 9 (సోమవారం), 10 (మంగళవారం), 11( బుధవారం), 14 (శనివారం)., 15 (ఆదివారం), 16( సోమవారం) తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నాయన్నారు.
మూడు ముళ్లు, ఏడు అడుగులు,నిండు నూరేళ్లకు శుభముహూర్తాలు పెట్టారు మన పండితులు. దేశవ్యాప్తంగా కూడా ఈ ఏడాది చివరలో లక్షల్లో పెళ్లిళ్లు అవుతాయని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సర్వే చేసింది.. దీనికి రూ.6 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. ఇక బట్టల దుకాణాలు, ఫంక్షన్ హాల్స్, బంగారం షాపులు బిజీ కానున్నాయి. ఇప్పటికే చాలా ఫంక్షన్ హాల్స్ బుక్ అయ్యాయి.
పురోహితులు, మేకప్ ఆర్టిస్టులు, డెకరేషన్ ఆర్టిస్టులు, క్యాటరింగ్, క్యాబ్,ఫోటోగ్రఫీ, బ్యాండ్ వారికి మంచి గిరాకీ ఉంటుంది. ఇప్పటినుంచే అందరితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఏడాదికి ఇవే పెళ్లి ముహూర్తాలు ఇక మరుసటి ఏడాది జనవరి సంక్రాంతి తర్వాతే ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.