జనవరి 13న  గోదారంగనాయకుల పెళ్లి.. 350 ఏళ్ల ఘనమైన చరిత్ర

  • ముంపు గ్రామంలో కొలువైన శ్రీరంగనాథుడు

బాల్కొండ,వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామమైన జలాల్ పూర్ లో 350 ఏళ్ల ఘనమైన చరిత్ర గలిగిన శ్రీ గోదాదేవి రంగనాయకుని పెళ్లి నేడు జరుగనుంది. కొంగుబంగారంగా కొలిచే రంగనాథుని వివాహం కోసం ఆలయ అభివృద్ధి కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. తమిళనాడు తిరుచురాపల్లిలో కొలువైన శ్రీరంగ రంగనాయకమ్మ క్షేత్రంలా నిత్యపూజలందుకుంటున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇక్కడాఉన్నట్లు స్థలపురాణం చెబుతోంది. 

ముంపు గ్రామంలో కొలువైన రంగనాథుడు

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపుగ్రామమైన జలాల్ పూర్ లో కొలువైన రంగనాథ స్వామి నిత్యపూజలు అందుకుంటున్నాడు. రంగనాథుడు రెండు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ పూజారి వేణుగోపాల్ తెలిపారు. సంక్రాంతికి గోదాదేవి రంగనాథుల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు.