
రాయికల్, వెలుగు: తెలంగాణ అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి పెళ్లితో శుక్రవారం ఒక్కటయ్యారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మూడుబొమ్మల మేడిపల్లి(పడమర)కి చెందిన జోరిగే అశోక్ ఉపాధి కోసం జోర్డాన్ వెళ్లాడు. అక్కడ శ్రీలంకకు చెందిన సమన్వి అలియాస్ మరియ పరిచయమైంది. ఆమె తల్లిదండ్రులు దుబాయ్‌లో ఉండగా వారిని ఇద్దరూ కలిసి ఒప్పించారు.
అశోక్‌కు తల్లిదండ్రులు లేకపోవడంతో అక్కాబావ చేగంటి శేఖర్, పూజితలకు చెప్పడంతో వారూ ఒప్పుకున్నారు. దీంతో భూపతిపూర్ రాయికల్‌లోని శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో వారికి పెళ్లి జరిగింది. ఈ వివాహానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.