సికింద్రాబాద్, వెలుగు: తెల్లారితే పెళ్లి ఉండగా, కట్నం డబ్బులతో వరుడు కనిపించకుండా పోయాడు. మారేడుపల్లి చెందిన యువతి, కొంపెల్లికి చెందిన సందీప్ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. మూడు నెలల క్రితం వీరికి నిశ్చితార్థం జరగగా, ఈ నెల 8న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. కట్నం కింద వరుడికి యువతి తల్లిదండ్రులు ముందే రూ.10 లక్షలు చెల్లించారు.
శుక్రవారం పెళ్లి ఉండడంతో ఏర్పాట్లపై అడిగేందుకు వరుడికి యువతి కుటుంటసభ్యులు బుధవారం ఫోన్ చేశారు. ఫోన్ స్విచాఫ్ రావడంతోఅతడి కుటుంబ సభ్యులను సంప్రదించగా, వరుడు కనిపించట్లేదని చెప్పారు. దీంతో కావాలనే ఇంటి నుంచి పారిపోయి వరుడు తమను మోసం చేశారని వధువు కుటుంబసభ్యులు మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.