బాలానగర్‌లో వివాహిత మహిళ సూసైడ్

హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. బాలానగర్ డివిజన్ వినాయక నగర్, రాజు కాలనీలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని దేవి సూసైడ్ చేసుకుంది. 2017లో ఉమాపతితో దేవి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.