ఆత్మహత్య చేసుకున్న బ్యాంకు మేనేజర్ భార్య

ఆత్మహత్య చేసుకున్న బ్యాంకు మేనేజర్ భార్య

హైదరాబాద్: బేగంపేటలో వివాహిత ఆత్మహత్య కలకలం రేపింది. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి మహిళ నివాసముంటున్న అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని రంజితగా గుర్తించారు. 

హరిత్ ప్రభు, రంజిత ఇద్దరూ భార్యాభర్తలు. ప్రభు బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తుండగా.. రంజిత గృహిణి. కొద్ది రోజుల క్రితమే వీరు తమ నివాసాన్ని చెన్నై నుంచి నగరానికి మార్చారు. మృతురాలు రంజిత అనారోగ్య సమస్యలతో భాదపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తున్నట్లు సమాచారం. ఎప్పటిలానే ప్రభు విధులకు హాజరయ్యేందుకు వెళ్లగా ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. 

అపార్ట్‌మెంట్ పైనుంచి ఏదో పడినట్లు బిగ్గరగా శబ్దం రావడంతో ఇరుగు పొరుగు బయటకు పరుగులు చూశారు. చూస్తే రంజిత రక్తపు మడుగులో పడి ఉంది. హుటహుటిన ఆమెను ఆసుపత్రి కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో ధర్యాప్తు చేస్తున్నారు.