నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్‌కు చెందిన వివాహిత అమెరికాలో సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. నర్సంపేట టౌన్‌కు చెందిన మాజీ ఎంపీపీ రుద్ర ఓంప్రకాశ్, కౌన్సిలర్ రుద్ర మల్లేశ్వరి దంపతుల కుమారుడు వంశీ అమెరికాలో నివసిస్తున్నాడు.
వంశీ భార్య లావణ్య కొన్నేళ్లుగా అమెరికాలోని టెక్సస్ వ్యాలీలో ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్ చేస్తోంది. ఏమైందో ఏమో ఈనెల 22న లావణ్య తన ఇంట్లో సూసైడ్ చేసుకున్నట్లు ఆమె బంధువులకు సమాచారం అందింది. వెంటనే వారు ఆదివారం అమెరికాకు బయల్దేరారు. లావణ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె సొంత ఊరు హైదరాబాద్.