
- హైదరాబాద్ కేపీహెచ్ బీ పరిధిలో ఘటన
కూకట్పల్లి, వెలుగు: అత్తింటి వేధింపులతో వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వరంగల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన అన్నం రవీందర్‌రెడ్డి, లక్ష్మి దంపతుల కూతురు సౌజన్య(29)కు 2020లో రజనీకాంత్‌రెడ్డితో పెండ్లి అయింది. దంపతులు కేపీహెచ్బీ కాలనీలో ఉంటున్నారు.
పెండ్లయినప్పటి నుంచే సౌజన్యను భర్తతోపాటు అత్త మంజుల, మరిది శ్రీకాంత్‌రెడ్డి శారీరకంగా, మానసికంగా వేధిస్తుండగా..ఆమె పలుమార్లు పుట్టింట్లో చెప్పుకొని, బాధ పడింది. వేధింపులు పెరగడంతో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుంది. తన ఆత్మహత్యకు భర్త, అత్త, మరిది కారణమని సూసైడ్ నోట్రాసింది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.