-
బండతో కొట్టి.. స్క్రూడ్రైవర్‌తో ముఖంపై పొడిచి.. స్పందనను చంపిన ఇంటర్ ఫ్రెండ్
-
భర్తకు దూరంగా ఉంటుందని తెలిసి తరచూ వేధింపులు
-
తనను పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి.. ఒప్పుకోకపోవడంతో హత్య
మియాపూర్, వెలుగు: హైదరాబాద్ మియా పూర్ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన వివాహిత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. లవ్‌ను యాక్సెప్ట్ చేయలేదని, పెండ్లి చేసుకోలేదనే కక్షతో ఇంటర్ ఫ్రెండ్ విచక్షణారహితంగా రాయితో కొట్టి, స్క్రూడ్రైవర్‌తో ముఖంపై పొడిచి చంపినట్లు తేల్చారు. మియాపూర్ ఇన్స్పెక్టర్ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపిన ప్రకారం.. దీప్తీశ్రీనగర్ కు చెందిన స్పందన(29), వినయ్‌కుమార్, గచ్చిబౌలి సుదర్శన్‌నగర్ ఆల్ఎంఓయూ కాలనీకి చెందిన ఎం.మనోజ్‌కుమా ర్(29) ఇంటర్ మీడియట్ నుంచి ఫ్రెండ్స్. ఆ టైంలో మనోజ్ లవ్ ప్రపోజ్ చేయగా, స్పందన రిజెక్ట్ చేసింది. మనం ఫ్రెండ్స్‌గానే ఉందామని చెప్పింది. తర్వాత వినయ్‌కుమార్‌ను ప్రేమించింది.
2022లో పెద్దల అంగీకారంతో పెండ్లి చేసుకుంది. కొన్ని నెలలకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులకు అప్లయ్చేశారు. అప్పటి నుంచి స్పందన తన తల్లి, సోదరుడితో కలిసి దీప్తి నగర్ లోని సీబీఆర్ఎస్టేట్ లో ఉంటోంది. వినయ్కుమార్అదే కాలనీలోని మరో ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మనోజ్‌కుమార్ స్పందనకు దగ్గరయ్యాడు. తరచూ స్పందన ఇంటికి వెళ్లి తన ప్రేమను యాక్సెప్ట్చేయాలని, పెండ్లి చేసుకుంటానని వేధించేవాడు.
స్పందన తిరస్కరించడంతోపాటు ఇతర ఫ్రెండ్స్, కొలీగ్స్‌తో సన్నిహితంగా ఉండటాన్ని చూసి మనోజ్ జీర్ణించుకోలేకపోయాడు. స్పందనను చంపేయాలని డిసైడ్అయ్యాడు. గత నెల 30న ఇంట్లో ఒంటరిగా నిద్రపోతున్న స్పందనపై దాడి చేశాడు. గ్రానైట్‌రాయితో తలపై కొట్టి, స్క్రూడ్రైవర్‌తో ముఖంపై పొడిచి చంపేశాడు. తర్వాత మెయిన్‌డోర్‌ను బయటి నుంచి లాక్ చేసి పారిపోయాడు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో మియాపూర్పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ఫోన్ కాల్స్‌డేటా, సీసీ ఫుటేజీల ఆధారంగా స్పందనను చంపింది మనోజ్‌కుమార్ గా గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.