అత్తింటి వేధింపులను తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ లో చోటు చేసుకుంది. రవళి అనే వివాహిత.. అత్తింటి వేధింపులతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ... యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన రవళి( 25)కి మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి తో 2019లో వివాహం జరిగింది..పెళ్లయిన మూడు నెలల నుండే భర్త, అత్త, మామ, ఆడబిడ్డ వేధింపులు రవళికి ఎక్కువయ్యాయి.
ఆ తర్వాత వీరు హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి సాత్విక (5) పునర్విక (3) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ తరువాత ఉప్పల్ లోని చిలుక నగర్ లో నివాసముంటున్నారు. ఏడాది క్రితం భార్య.. పిల్లలను వదిలేసి రాజశేఖరరెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో పిల్లలకు ఆధార్ కార్డు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు.
ALSO READ | హైదరాబాద్ విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్..
సంవత్సరం క్రితం చిలుకనగర్ లోనే భార్య ఇద్దరు పిల్లలను వదిలేసి రాజశేఖర్ రెడ్డి వెళ్ళిపోయాడు..బీటెక్ చదివిన రవళి చిలక నగర్ లోని స్కూల్లో టీచర్ గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తుంది...భర్త వదిలేసి వెళ్లిపోవడం... పిల్లలకు ఆధార్ కార్డు లేకపోవడంతో .. స్కూల్లో పిల్లలకు అడ్మిషన్ లభించకపోవడంతో.. భర్త ఆచూకి తెలుసుకుని పిల్లలను భర్త వద్ద వదిలేసింది. దీంతో భర్త కుటుంబం నుంచి రవళికి వేధింపులు ఎక్కువ అయ్యాయి.
శనివారం ( ఫిబ్రవరి 1) హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ కు వచ్చిన రవళి అత్త.. మామ.. రాజశేఖర్ భార్య రవళి ఇంటికి వెళ్లారు. ఆ రాత్రే ఆమె చనిపోవడంతో పలు అనుమానాలకు దారితీసింది. రవళిని ఆమె భర్త, అత్త, మామ వేధించడం వల్లే శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టానికి గాంధీ ఆస్పత్రికి తరలించారు. రవళి డెడ్ బాడీని చూడటానికి భర్త, అత్త, మామ, ఆడబిడ్డ లు రాలేదు..
రవళి కుటుంబసభ్యులు.. బంధువులు భర్త.. అత్త.. మామ.. ఆడబిడ్డ వల్లే చనిపోయిందని ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని పిలిచినా ఇంతవరకు విచారణకు హాజరుకాలేదు. రవళి మరణాన్ని కారణమైన భర్త, అత్త మామ ఆడబిడ్డ పై చర్యలు చేపట్టాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.